Begin typing your search above and press return to search.
భార్యను చంపేసి.. పక్కనే పడుకొని సెల్ఫీ దిగాడు!
By: Tupaki Desk | 8 May 2021 6:40 AM GMTభార్యను చంపేసి, ఆమె శవం పక్కన పడుకొని సెల్ఫీ కూడా తీసుకున్నాడో వ్యక్తి. స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన కడప జిల్లా బద్వేల్ లో చోటు చేసుకుంది. అయితే.. వీరికి పెళ్లై కేవలం 7 నెలలు మాత్రమే కావడం గమనార్హం. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన యువకుడు ఏడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. భార్య ఇంటికి వచ్చిన దగ్గర్నుంచీ అన్యోన్యంగానే కాపురం చేస్తున్నారు. అయితే.. శుక్రవారం రాత్రి ఎవ్వరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. భార్యను చంపేశాడట యువకుడు!
ఎందుకు చంపాడు? గొడవ ఎక్కడ మొదలైందన్నది తెలియలేదు. అయితే.. ఇది క్షణికావేశంలో జరిగింది కాదని మాత్రం అర్థమవుతోంది. ఎలాగంటే.. భార్య చనిపోయిన తర్వాత, ఆమె మృతదేహం పక్కనే పడుకొని సెల్ఫీ కూడా తీసుకున్నాడట. ఈ సంఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడుని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
పెళ్లయిన 7 మాసాలకే భార్యను హత్యచేయడంతో బంధువులు తీవ్రంగా దుఃఖిస్తున్నారు. ఈ పరిస్థితి కారణమేంటని పోలీసులు ఆరాతీసినప్పటికీ.. తగిన వివరాలు లభ్యం కాలేదట. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారని నిందితుడి తల్లిదండ్రులు తెలిపారట. దీంతో.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.