Begin typing your search above and press return to search.

రాజీవ్ హత్యలో ‘‘పెద్ద పులి’’ దిద్దుకోలేని తప్పు

By:  Tupaki Desk   |   11 March 2016 6:30 AM GMT
రాజీవ్ హత్యలో ‘‘పెద్ద పులి’’ దిద్దుకోలేని తప్పు
X
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య విషయంలో ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) సిద్ధాంతకర్త బాలసింగమ్ పశ్చాత్తాపడ్డాడా? దిద్దుకోలేనంత పెద్ద తప్పును చేసినట్లుగా ఫీలయ్యాడా? పెద్దపులి ప్రభాకరన్ రాజీవ్ ను హత్య చేయాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా ఆ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి? రాజీవ్ హత్య ప్లాన్ ను పార్టీ సిద్ధాంత కర్త దగ్గర ప్రభాకరన్ దాచి పెట్టారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభిస్తోంది ‘‘టు ఎండ్ ఏ సివిల్ వార్’ అనే తాజా పుస్తకం.

2006లొ కేన్సర్ తో లండన్ మరణించిన బాలసింగం.. తన మరణానికి ముందు మార్క్ సొల్టర్ అనే రచయితతో చాలానే విషయాలు చెప్పుకొచ్చాడు. రాజీవ్ హత్య విషయంలో ఆయన పలు వివరాల్ని వెల్లడించటంతో పాటు.. ఎల్టీటీఈ చీఫ్.. పెద్దపులి ప్రభాకరన్ దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశాడని వాపోయాడట. రాజీవ్ కానీ భారత ప్రధానమంత్రి అయితే తమపై మూకుమ్మడి దాడి జరగటం ఖాయమని.. అందుకే సిద్ధాంతానికి విరుద్ధంగా రాజీవ్ ను హత్య చేసినట్లు బాలసింగమ్ చెప్పాడట.

రాజీవ్ హత్యపై బాలసింగమ్ పశ్చాత్తాప పడ్డాడని రచయిత చెబుతున్నాడు. రాజీవ్ గాంధీని హత్య చేయాలన్న అంశంపై తనకు ఎలాంటి సమాచారం అందకుండా ప్రభాకర్ గుట్టుగా ఈ పని కానిచ్చాడని.. తర్వాత కొంతకాలం వరకూ తనకు అసలు విషయం చెప్పలేదని చెప్పినట్లుగా సొల్టర్ చెబుతున్నాడు. బాలసింగమ్ దగ్గర రాజీవ్ హత్య గురించి దాచి పెట్టిన ప్రభాకరన్.. ఆ పనిని తన ఇంటెలిజెన్స్ చీఫ్ పొట్టు అమ్మాన్ తో కలిసి పూర్తి చేశాడు. ఈ విషయాన్ని తర్వాత ఎప్పుడో బాలసింగమ్ కు చెప్పాడట.