Begin typing your search above and press return to search.
మగాడు స్కర్ట్ వేసుకుని టెన్నిస్ ఆడాడు..
By: Tupaki Desk | 15 July 2017 10:56 AM GMTవింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్ చూస్తున్న ఓ మగ అభిమాని.. స్టేడియంలోకి వచ్చి అమ్మాయిల స్కర్ట్ వేసుకుని టెన్నిస్ ఆడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. వింబుల్డన్ అధికారిక వెబ్ సైట్లో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది. ఇంతకీ ఈ స్కర్ట్ స్టోరీ ఏంటో చూద్దాం పదండి.
మహిళల టెన్నిస్ హిస్టరీ పేరున్న క్రీడాకారిణుల్లో ఒకరైన బెల్జియం భామ.. కిమ్ క్లియెస్టర్స్ డబుల్స్ మ్యాచ్ ఆడుతుండగా.. ఓ అభిమాని గట్టిగా అరుస్తూ కనిపించాడు. దీంతో అతణ్ని మైదానంలోకి ఆహ్వానించింది కిమ్. సర్వీస్ చేస్తా.. రిటర్న్ చేస్తారా అని అడిగితే ఆ అభిమాని సరే అన్నాడు. పెద్ద వయస్కుడైన లావు పాటి ఆ వ్యక్తి మైదానంలోకి వచ్చాడు. ఐతే వింబుల్డన్ మైదానంలో ఆడాలంటే కచ్చితంగా తెల్లటి డ్రెస్ వేసుకోవాలి. కానీ అతను రంగు రంగుల దుస్తులేసుకున్నాడు.
దీంతో క్లియెస్టర్స్ పరుగు పరుగున వెళ్లి తన బ్యాగులోంచి ఓ తెల్లటి స్కర్టు తీసుకొచ్చింది. అతడి ఆ వ్యక్తికి ఇచ్చింది. చాలీ చాలని ఆ స్కర్టును అతి కష్టం మీద తొడుక్కున్నాడు ఆ అభిమాని. అది చూసి నవ్వాపుకోలేకపోయింది క్లియెస్టర్స్. కింద పడి దొర్లుతూ గట్టిగా నవ్వేసిన ఆమె.. లేచిన తర్వాత కూడా నవ్వాపుకోలేకపోయింది. అలాగే వెళ్లి ఆ అభిమానికి బంతిని సర్వ్ చేయగా.. అతను రిటర్న్ చేశాడు. దీంతో స్టేడియమంతా హోరెత్తిపోయింది.