Begin typing your search above and press return to search.
నార్త్ కొరియా అధ్యక్షుడి కొత్త పిలుపు విన్నారా?
By: Tupaki Desk | 17 Aug 2016 4:31 AM GMTఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తాజా వ్యాఖ్యలు వింటే మానవత్వమున్నవారికి జుగుప్సగా అనిపిస్తున్నాయి. విశ్వాసానికి పెట్టింది పేరుగా నిలిచే పెంపుడు జంతువు కుక్కపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ వ్యాఖ్యలపై కొరియన్లు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకూ కిం జాంగ్ ఉన్న చేసిన వ్యాఖ్యలేమిటో తెలుసా?.. కుక్కమాంసం తినాలని చెప్పడం.
అవును.. ప్రజంతా కుక్కమాంసం తినాలని చెబుతున్నాడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిం జాంగ్. "నా ప్రియమైన ప్రజలారా.. కుక్క మాంసాన్ని కడుపారా తినండి. బీఫ్ - మటన్ - చికెన్ - పోర్క్ - పక్షి మాంసాల కంటే కుక్కమాసం ఎంతో బలవర్ధకమైన ఆహారం" ఇది కిమ్ జాంగ్ తన జాతికి తాజాగా తాజాగా ఇచ్చిన పిలుపు. ఒకవైపు వైపు కుక్క మాంస భక్షణకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో కిమ్ జాంగ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుక్క మాంసంలో చాలా అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయని, ఆ మాంసంలో ఉన్న విటమిన్స్ మనిషికి బలాన్నిస్తాయని కిమ్ జాంగ్ అన్నట్లు అక్కడి వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
అధ్యక్షుడే కుక్క మాంసంపై ఆ రేంజ్లో ప్రకటనలు చేసేసరికి, ఆయనకు మద్దతుగా కొరియా అధికార టీవీ చానెల్ - పత్రికలు సైతం కుక్కమాంసం గొప్పతనం - ఆరోగ్యానికి కుక్కమాసం - కుక్కమాంసం ఎంత బలమైనదంటే అని హెడ్డింగులు పెట్టి పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసేస్తున్నాయని "ది కొరియా టైమ్స్" పేర్కొంది. అధ్యక్షుడే ఇలా అంటే మరో అడుగు ముందుకేసిన కొంతమందైతే.. "కుక్కలను మామూలుగా తిన్పప్పటి కంటే వాటిని భయంకరమైన బాధకు గురిచేసి చంపి తింటే ఆ రుచేవేరు" అని సెలవిస్తున్నారట. ఆ విషయం తెలిసినవారు.. ఇక కొరియా కుక్కలను ఆ దేవుడే కాపాడాలని అంటున్నారట!