Begin typing your search above and press return to search.

కిమ్ గుర్రం ఎక్కితే.. ఎందుకంత భయాందోళనలు?

By:  Tupaki Desk   |   17 Oct 2019 5:52 AM GMT
కిమ్ గుర్రం ఎక్కితే.. ఎందుకంత భయాందోళనలు?
X
కొందరు అధినేతల తీరు భిన్నంగా ఉంటాయి. వారి తీరుతో కొన్నిసార్లు వారేం చేయాలనుకుంటున్న విషయం కాస్త ముందుగా పసిగట్టే వీలు ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితే కిమ్ విషయంలోనూ ఉందంటున్నారు. అదెలానంటే.. ఉత్తరకొరియా నియంత.. కర్కసానికి నిలువెత్తు రూపంగా ఉండే ఆయనకో అలవాటు ఉంది. ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నా.. సాహసోపేతమైన నిర్ణయాల్నిప్రకటించే ముందే ఆయన సాహస యాత్రలు చేస్తుంటారు.

అలాంటి యాత్ర ఒకటి చేస్తున్నారంటే.. ఆయన నోటి నుంచి రానున్న రోజుల్లో ఏదో కీలక ప్రకటన వెలువడే వీలున్నట్లే. తాజాగా కిమ్ గుర్రం ఎక్కారు. ఆయన గుర్రం ఎక్కటమంటే అషామాషీగా కాదు. ఉత్తరకొరియాలో అత్యంత ప్రమాదకరమైన పయేక్టు పర్వతంపై ఆయన గుర్రపు స్వారీ చేస్తున్నారు. అది కూడా ఆయన ఒక్కరే స్వారీ చేసినట్లుగా ఆ దేశానికి చెందిన మీడియా సంస్థ వెల్లడించింది.

ఈ వార్తతో పలువురు ఉలిక్కిపడుతున్నారు. ఎందుకంటే.. సాహసయాత్రలు చేస్తుననారంటే సంచలన ప్రకటనలకు టైమొచ్చినట్లే. మరీసారి కిమ్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడుతుందన్నది ఉత్కంటగా మారింది. పయేక్టు పర్వతంతో కిమ్ కు మరో అనుబంధం కూడా ఉంది. ఇది ఆయన వంశీకులకు అధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. అందరి అంచనాల ప్రకారం మరి ఆయన ఏ అంశం మీద ప్రకటన చేస్తారో చూడాలి.