Begin typing your search above and press return to search.
కిమ్ కయ్యానికి కాలు దువ్వుతున్నాడా? అతి పెద్ద సైనిక కవాతుకు రంగం సిద్ధం
By: Tupaki Desk | 10 Oct 2020 8:00 AM GMTనిత్యం వివాదాస్పద విషయాలతో వార్తల్లో నిలిచే ఉత్తరకొరియా అధ్యక్షడు కిమ్ జంగ్ ఉన్ .. ఇప్పుడు మరో సంచలన నిర్ణయానికి తెరలేపాడు. చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా తన దేశంలో అతిపెద్ద సైనిక కవాతు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ కవాతులో భారీ క్షిపణులు, తమ దేశ సైనిక సామర్థ్యాలు ప్రపంచానికి తెలియజెప్పడానికి ఈ తరహా చర్యలు చేపడుతున్నాడని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. సైనిక కవాతు కోసం అక్కడి సైన్యం సన్నద్ధం అయ్యింది. అయితే ఉత్తరకొరియా సైనిక కవాతును చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది. అక్కడ చిన్నపొరపాటు జరిగినా సహించరు. రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా ఇలాంటి కవాతులు నిర్వహిస్తారు.
కఠినమైన ఆర్థిక ఆంక్షలు ఉన్నా సమకూర్చుకున్న కొత్త ఆయుధాలు, క్షిపణులను ప్రదర్శించడానికీ ఈ కవాతులను ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉత్తరకొరియాలోని పాలక ‘వర్కర్క్ పార్టీ’ 75వ వార్షికోత్సవమైన అక్టోబరు 10 సందర్భంగా ఈ కవాతు నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్న ప్రస్తుత తరుణంలో ఈ కవాతు నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 32 వేల మందితో కవాతు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించింది. ప్యాంగ్యాంగ్ మిరిమ్ విమానాశ్రయంలో ఈ కవాతు చేపట్టనున్నారు. కవాతులో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, జలాంతర్గాములు ప్రయోగించే అవకాశం ఉంది. మరోవైపు కిమ్ ఇల్-సుంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన 600 మంది విద్యార్థులు, పరిశోధకులూ ఈ కవాతులో పాల్గొననున్నారు. ఈ కవాతులో ఎటువంటి క్షిపణులు ప్రదర్శిస్తారనే ఆసక్తి నెలకొన్నది. 70 ఏళ్లుగా ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వైరం ఉన్న విషయం తెలిసిందే. కొంతకాలంగా ఇరు దేశాలు శాంతి మంత్రాలను జపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కవాతుతో మళ్లీ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయోమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.