Begin typing your search above and press return to search.
సన్నగా కరెంట్ తీగలా కీమ్.. ప్రజల ఏడుపులు?
By: Tupaki Desk | 29 Jun 2021 8:30 AM GMTలావుగా బందరులడ్డూలా ఉండే ఉత్తరకొరియా నియంత కిమ్ సడెన్ గా ఆ మధ్య మాయపోయి కొన్నాళ్లు ఎటుపోయాడో ఎవరికీ అర్థం కాలేదు. కానీ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన కిమ్ చాలా సన్నబడ్డాడు. లడ్డూలా ఉండే కిమ్ బక్కచిక్కి కరెంట్ తీగలా మారిపోయాడు. రాజకీయ నాయకులు సాధారణంగా ఇలా సన్నబడడం చాలా అరుదు.. కానీ కిమ్ దాన్ని చేసి చూపించాడు. అయితే అనారోగ్యమే కిమ్ ను అలా బక్కచిక్కిపోయేలా చేసిందన్న వాదన వినిపించింది.
ఉత్తరకొరియాను నియంతలా పాలిస్తున్న కిమ్ అక్కడి ప్రజలను ప్రజాస్వామ్యానికి దూరంగా అనాగరికంగా వ్యవహరిస్తున్నాడు. కిమ్ గురించి ప్రపంచవ్యాప్తంగా క్రూరుడు అని ప్రచారం జరిగినా ఆ దేశ ప్రజలు మాత్రం కిమ్ పాలనపై వ్యతిరేకత వ్యక్తం చేయరట..
కిమ్ అనారోగ్యానికి గురై కోలుకున్న తర్వాత ఇటీవలే ప్రజల వద్దకు వచ్చాడు. ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. కిమ్ ను అలా సన్నగా చూసి అక్కడి ప్రజలందరూ ఏకంగా ఆందోళనతో కన్నీరు కార్చారట.. ఈ మేరకు ఆ దేశ అధికారిక మీడియా పేర్కొన్నట్లు తెలిసింది.
కిమ్ ఇలా బక్కచిక్కిపోవడానికి కారణం ఏంటని.. ఆయనకు అనారోగ్యమా? అని ప్రజలందరూ కలత చెందారని.. కన్నీళ్లు పెట్టుకున్నారని ఉత్తరకొరియా అధికారిక మీడియా చెప్పిందట.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.