Begin typing your search above and press return to search.

వార్ రూమ్ లో కిమ్‌...ట్రంప్ వెన‌క‌డుగు!

By:  Tupaki Desk   |   15 Aug 2017 11:58 AM GMT
వార్ రూమ్ లో కిమ్‌...ట్రంప్ వెన‌క‌డుగు!
X
కొద్ది రోజులుగా ఉత్త‌ర కొరియా, అమెరికా ల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఇరు దేశాల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. ప‌సిఫిక్ స‌ముద్రంలో ఉన్న‌ అమెరికా దీవి గువామ్ ను ఉత్త‌ర కొరియా టార్గెట్ చేసుకొని త‌న స్టామినా నిరూపించాల‌ని ఆలోచిస్తోంది. గువామ్ పై నాలుగు హాసంగ్‌-12 క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించి అమెరికాకు షాక్ ఇవ్వాల‌ని ఉత్త‌ర కొరియా ప్లాన్ చేస్తోంది. జ‌పాన్ స‌ముద్ర జ‌లాల మీదుగా ఆ క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూరుస్తూ ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ వార్ రూమ్ లో ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. కొంత‌మంది కీల‌క అధికారుల‌తో వార్ రూమ్ లో కిమ్ స‌మావేశ‌మైన చిత్రాలు మీడియాలో వెల్ల‌డ‌య్యాయి. దీంతో కిమ్ ప్ర‌క‌ట‌న‌లు తాటాకు చ‌ప్పుళ్లు కావ‌ని స్ప‌ష్ట‌మైంది.

పసిఫిక్‌ సముద్ర జలాల్లో ఉన్నగ్వామ్‌ ద్వీపంపై అణు దాడికి త‌గిన ప్రణాళికను కూడా సిద్ధం చేశామన్న కిమ్ ప్ర‌క‌ట‌నల‌కే ప‌రిమితం కాలేదు. గ్వామ్ ద్వీపం పై దాడి చేసేంద‌కు కిమ్ కీల‌క అధికారుల‌తో వ్యూహ ర‌చ‌న చేస్తున్నారు. కిమ్‌, అధికారులు సమావేశమైన 'వార్‌ రూమ్‌' చిత్రాలను ఆ దేశ మీడియా బయటకు విడుదల చేసింది. గ్వామ్‌ ద్వీపానికి సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను కిమ్‌ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఓ చిత్రంలో తెలుస్తోంది. ఆయన వెనుక భాగంలో కొరియా, జపాన్‌ దేశాల సముద్రజలాల్లో ఉన్న అమెరికా బేస్‌లకు సంబంధించిన చిత్రాలున్నాయి.

ఉత్తరకొరియాకు తూర్పున ఉన్న ఓ నావల్‌ బేస్‌ నుంచి జపాన్‌ మీదుగా గ్వామ్‌ పై దాడి చేసేందుకు కిమ్‌ వ్యూహం రచించారని దక్షిణ కొరియా మిలటరీ నిపుణుడు ఒకరు తెలిపారు. అయితే, గ్వామ్‌ దీవిపై ప్ర‌యోగించాల‌నుకున్న హాసంగ్‌-12 మిస్సైళ్లకు నిజంగా అంతటి శక్తి లేద‌ని, అవి 17 నిమిషాలు పాటు 3,356 కిలోమీటర్లు ప్రయాణించి గ్వామ్ దీవికి 30 నుంచి 40 కిలోమీట‌ర్ల దూరంలో స‌ముద్ర జ‌లాల్లో ప‌డతాయ‌ని తొలుత అమెరికా అంచ‌నా వేసింది. కానీ, హాసంగ్ క్షిప‌ణి సుమారు 3700 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌గ‌ల‌దని ఉత్తరకొరియా మిలిటరీ చెబుతోంది. వార్ రూమ్ ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో అమెరికా సోమవారం ఉత్తరకొరియా విషయంలో ఆచితూచి స్పందించిన‌ట్లు క‌నిపిస్తోంది. అమెరికా రియాక్ష‌న్ ను బ‌ట్టి మ‌రికొన్ని రోజుల పాటు గ్వామ్‌ పై దాడి ఆలోచ‌న‌ను ఉత్త‌ర కొరియా ప‌క్క‌న పెట్టేందుకు యోచించిన‌ట్లు తెలుస్తోంది.