Begin typing your search above and press return to search.

`కొరియా` అధ్య‌క్షుల‌ షేక్ హ్యాండ్...వైర‌ల్!

By:  Tupaki Desk   |   27 April 2018 1:10 PM GMT
`కొరియా` అధ్య‌క్షుల‌ షేక్ హ్యాండ్...వైర‌ల్!
X
ప్ర‌పంచ దేశాల‌కే పెద్ద‌న్న‌లా వ్య‌వ‌హ‌రించే అమెరికాను ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాన్ ఉంగ్ ఢీకొట్టేందుకు సిద్ధ‌ప‌డిన సంగతి తెలిసిందే. ఐక్య‌రాజ్య స‌మితి ఆదేశాల‌ను తుంగ‌లో తొక్కి మ‌రీ అణుపరీక్ష‌లు నిర్వ‌హించి ..అమెరికాను కిమ్ భ‌య‌పెట్టారు. అయితే, కొద్ది రోజుల క్రితం త‌న మ‌న‌సు మార్చుకొని ఇక‌పై అణు ప‌రీక్ష‌లు చేయ‌బోనంటూ ప్ర‌క‌టించి ప్ర‌పంచ దేశాల‌కు షాకిచ్చాడు. కిమ్ లో వ‌చ్చిన ఈ మార్పును చూసి ఉత్త‌ర‌కొరియాతో పాటు ప్ర‌పంచ‌దేశాలు కూడా ఆశ్చ‌ర్య‌పోయాయి. తాజాగా, కిమ్ మ‌రోసారి ప్ర‌పంచ‌దేశాల‌కు షాకిచ్చాడు. త‌మ చిర‌కాల ప్ర‌త్య‌ర్థి అయిన పొరుగు దేశం ద‌క్షిణ కొరియాకు కిమ్ స్నేహ హ‌స్తం అందించేందుకు సిద్ధ‌మ‌వ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాజాగా, ద‌క్షిణ‌కొరియా అధ్య‌క్షుడు మూన్ జే ఇన్ కు కిమ్ చ‌రిత్రాత్మ‌క క‌ర‌చాల‌నం చేసి అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌లో ముంచెత్తాడు. ఉత్త‌ర‌ - ద‌క్షిణ కొరియా అధ్య‌క్షులు షేక్ హ్యాండ్ ఫొటో ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఇరుదేశాల మధ్య ఉన్న‌ శాంతి గ్రామం పాన్‌ మున్‌ జోమ్ లో కిమ్ - మూన్ లు కలుసుకున్నారు. వారిద్ద‌రూ ఒక‌రినొకరు ఆత్మీయంగా ప‌ల‌క‌రించుకొని క‌ర‌చాల‌నం చేశారు. ఈ చరిత్రాత్మ‌క ఘ‌ట్టానికి పాన్ మున్ జోమ్ వేదికైంది. అయితే, ఇరు దేశాల సరిహద్దుల్లో కిమ్ - మూన్ లు నిల్చున్నారు. ఆ స‌మ‌యంలో మూన్ ను ఉత్తరకొరియాలోకి కిమ్‌ ఆహ్వానించారు. ఆ త‌ర్వాత మూన్ తో కలసి కిమ్‌ దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. 1953-54ల మధ్య కొరియా యుద్ధం త‌ర్వాత దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన తొలి ఉత్తరకొరియా అధ్యక్షుడిగా కిమ్ చ‌రిత్ర‌పుట‌ల‌కెక్కాడు. ఈ చ‌రిత్రాత్మ‌క ఘ‌ట్టానికి జ్ఞాప‌కంగా ఇరు దేశాధ్యక్షులు ఓ మొక్కను కూడా నాటనున్నారు. మ‌రోవైపు, 1953-54ల మధ్య యుద్ధం శాంతియుత ఒప్పందంతో ముగియక‌పోవ‌డంతో ఆ విష‌యంపై కిమ్‌ - మూన్ లు చర్చిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, త్వ‌ర‌లో ట్రంప్ తో కూడా కిమ్ భేటీ కానున్న‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి