Begin typing your search above and press return to search.
సింగపూర్ వీధుల్లో అలా చేసిన కిమ్
By: Tupaki Desk | 12 Jun 2018 6:14 AM GMTఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి తెలిసిన వారే కానీ.. ఆయన్ను దగ్గర నుంచి చూసింది తక్కువ. ఆయన తీరు ఊహించని విధంగా ఉంటుందని.. ఏ నిమిషాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలీని రీతిలో ఆయన వ్యవహరిస్తారని చెబుతారు. తాజాగా అమెరికా అధ్యక్షుడుట్రంప్ తో భేటీ కోసం సింగపూర్ వచ్చిన ఆయన.. ఊహించని విధంగా వ్యవహరిస్తూ సింగపూర్ ప్రజలకు స్వీట్ షాకిచ్చారు.
తాను బస చేసిన సెయింట్ రెజిస్ హోటల్‌నుంచి కిమ్ బయటకు వచ్చి.. సరదాగా వీధుల్లో చక్కర్లు కొట్టారు. దీంతో.. సింగపూర్ వాసుల ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. అణ్వాయుధాలతో అగ్రరాజ్యానికే సినిమా చూపించిన కిమ్.. ఇంత సింఫుల్ గా వీధుల్లోకి రావటం.. సరదాగా నవ్వుతూ జనం మధ్య తిరగటాన్ని సింగపూర్ ప్రజలు ఎంజాయ్ చేశారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎవరికి వారుగా ఎగబడ్డారు.
మరికొందరైతే కిమ్.. కిమ్ అంటూ నినాదాలు చేయటం విశేషం. ఇదిలా ఉంటే.. కిమ్ తో పాటు ఆయన సోదరి కిమ్ యో జోంగ్.. ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రియోంగ్ హోతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు ఉన్నారు. ట్రంప్ తో చర్చల కోసం వచ్చిన కిమ్.. పనిలో పనిగా సింగపూర్ తో తమ దేశ సంబందాలు మరింత మెరుగుపడేలా చర్చలు జరపటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడితో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మొత్తానికి కిమ్ సందడి సింగపూర్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.