Begin typing your search above and press return to search.
దేనికైనా సిద్ధం .. తొలిసారి అమెరికా ను టార్గెట్ చేసిన కిమ్ !
By: Tupaki Desk | 19 Jun 2021 9:30 AM GMTఅమెరికాతో తాడో పేడో తేల్చుకోవడానికి ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సిద్ధమయ్యారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాలకు దూరంగా ఉండి చర్చలను పునరుద్ధరించాలని అమెరికా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కిమ్ తన అధికా ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అమెరికాతో చర్చలకు సిద్ధపడాలని, అవసరమైతే ఘర్షణకు దిగాల్సి వస్తుందని, ఆ దేశంతో తాడో పేడో తేల్చు కోవడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికా రులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక వైపు చర్చలకు సిద్ధపడుతూనే మరోవైపు తమకున్న అణ్వాయుధ బలాన్ని చూపించి అమెరికా తమ దేశం పట్ల ద్వేషభావంతో కూడిన విధానాలు విడనాడేలా చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు చెప్పినట్టుగా అక్కడ అధికారిక మీడియా వెల్లడించింది.
గురువారం జరిగిన పార్టీ సమావేశం లో కిమ్ అమెరికా పట్ల అనుసరించాల్సి వైఖరిని అందరికీ వెల్లడించారు. అటు చర్చలకు సిద్ధం కావాలి. ఇటు ఘర్షణకీ సన్నద్ధం కావాలి. మన దేశ భద్రత, పరువు కాపాడుకోవడానికి, స్వతంత్రంగా అభివృద్ధి చెందడానికి అమెరికాతో అమీతుమీ తేల్చుకోవడమే మంచిది అని కిమ్ ఆ సమావేశం లో పేర్కొన్నట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. 2018, 19లో అప్పట్లో అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ తో కిమ్ చర్చలు జరిపారు. అణ్వాయుధాలను పాక్షికంగా అప్పగించ డానికి తమ దేశంపై విధించే ఆంక్షలన్ని ఎత్తేయా లని కిమ్ డిమాండ్ ను ట్రంప్ తిరస్కరించడంతో ఆ చర్చలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. పూర్తి స్థాయిలో అణ్వస్త్ర రహిత దేశంగా కొరియా నిలవాలని గత వారంలో జరిగిన జీ 7 సదస్సు పిలుపు నిచ్చింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అటు ట్రంప్ మాదిరిగా దూకుడుగా వ్యవహరించకుండా, ఇటు బరాక్ ఒమాబా మాదిరి వ్యూహాత్మకంగా మౌనం పాటించకుండా మధ్యేమార్గంగా ముందు కు వెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు కిమ్ అమెరికా తమ దేశానికి వ్యతిరేకంగా కార్యకలా పాలు నిర్వహిస్తే అణ్వాయుధ కార్యక్రమాలను మరింత విస్తరించి వాషింగ్టన్ కు టార్గెట్ చేసేలా హై టెక్ ఆయుధాలు రూపొందిస్తామని హెచ్చరించారు. అమెరికాని ఎదుర్కోవాలంటే మరింతగా అణ్వాయుధ బలాన్ని పెంచుకోవాలన్నదే ఉత్తర కొరియా భావనగా ఉంది.