Begin typing your search above and press return to search.

అన్నకు ప్రత్యామ్నాయం సోదరే: ఉత్తర కొరియాలో చెల్లిదే పెత్తనం

By:  Tupaki Desk   |   12 Jun 2020 2:30 AM GMT
అన్నకు ప్రత్యామ్నాయం సోదరే: ఉత్తర కొరియాలో  చెల్లిదే పెత్తనం
X
చిన్న దేశం.. ప్రజాస్వామ్యంలో ఉండి రాజరికం.. నియంతృత్వం అమలు చేస్తున్న దేశం అది. అదే ఉత్తర కొరియా. ఈ దేశం వినగానే ఠక్కున గుర్తొచ్చే పేరు కిమ్. అమెరికాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యక్తి అతడు. కిమ్ తండ్రి నుంచి అధికారాన్ని సొంతం చేసుకున్నాక, తనదైన శైలిలో పరిపాలించడం మొదలుపెట్టాడు. అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పొరుగున ఉన్న జపాన్, దక్షిణ కొరియాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒకే ఒకరిని నమ్ముతున్నాడు. తన వారసత్వం అప్పగించేస్తున్నాడు. ఎందుకంటే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

కిమ్ తన సోదరి కిమ్ యో జోంగ్ ను పరిపాలనలోకి తీసుకొచ్చాడు. అతడు అనారోగ్యానికి గురైనప్పుడు మొత్తం ఆమెనే వ్యవహారాలు నడిపించింది. ఇక అప్పటి నుంచి ఆమెను పూర్తిగా విశ్వసించడం మొదలుపెట్టాడు. ఆమె గతంలో కొన్ని సలహాలు మాత్రమే ఇచ్చేది. కానీ ఇప్పుడు కిమ్ కు పూర్తి స్థాయి సలహాదారుగా మారిపోయింది. దేశ రాజకీయాల్లో ఆమె మాటకు విలువ పెరిగింది. కిమ్ ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ సంతకం పెట్టాలి అనే విషయాలు ఆమె చూసుకుంటోంది.

కిమ్ కు సంబంధించిన ప్రతి విషయం అతడి సోదరి చూసుకుంటోంది. ఆమెకు తెలియకుండా ఏ చిన్న పని జరిగేందుకు వీలు లేకుండా ఆమె పాత్ర పెరిగింది. ఈ క్రమంలో దేశ వ్యవహారాలన్నింటిని ఆమెనే నడిపిస్తోంది. కిమ్ ఉన్నా పరిపాలనంతా ఆమె చేతిలోకి వెళ్లింది. మొన్న దక్షిణ కొరియాను హెచ్చరించి ఆ దేశంతో తో తెగదెంపులు చేసుకున్న వ్యవహారంలో ఆమెనే కీలక పాత్ర పోషించింది. ఆ తతంగం మొత్తాన్ని వెనుకనుండి నడిపించింది కిమ్ సోదరి. ఈ నేపథ్యంలో కిమ్ తరువాత దేశ పగ్గాలు ఆమెకే దక్కనున్నాయని తెలుస్తోంది. సోదరికి కిమ్ పట్టం కట్టడం ఖాయం అనిపిస్తోంది. కిమ్ ఎంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడో అందరికి తెలుసు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో అన్న కిమ్ ను మించిపోయింది కిమ్ యో జోంగ్. సోదరి ఎలా చెప్తే అన్న కిమ్ ఇప్పుడు అలా వింటున్నాడని తెలుస్తోంది. ఆయన అనారోగ్యంతో బాధపడుతుండడంతో అన్ని ఆమెనే చూసుకుంటున్నారు. భవిష్యత్తు లో ఆమగ ఉత్తర కొరియా దేశానికి అధ్యక్షురాలు అయ్యే అవకాశం మెండుగా ఉంది.