Begin typing your search above and press return to search.

సన్ షైన్ ఆసుపత్రి ఇకపై కిమ్స్ చేతుల్లోకి.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   28 Oct 2021 7:05 AM GMT
సన్ షైన్ ఆసుపత్రి ఇకపై కిమ్స్ చేతుల్లోకి.. ఎందుకంటే?
X
డాక్టర్ గురవా రెడ్డి అన్నంత నే మోకాలి శస్త్రచికిత్స తో పాటు.. సన్ షైన్ ఆసుపత్రి గుర్తు కు వస్తుంది. దాదాపు పదేళ్లు గా తక్కువ ఖర్చు కు నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుందన్న పేరున్న సన్ షైన్ ఆసుపత్రి లో మెజార్టీ వాటా ను ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి కిమ్స్ (క్రిష్ణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సొంతం చేసుకుంది.

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం సన్ షైన్ ఆసుపత్రి లో 51.07 శాతం వాటా ను కొనుగోలు చేయటానికి కిమ్స్ ఓకే చేసింది. దీంతో.. ప్రముఖ అర్థో సర్జన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి ఆయన టీం మొత్తం కిమ్స్ ఆసుపత్రి తో జత కట్టినట్లు అవుతుంది. దీంతో..కిమ్స్ ఆసుపత్రి తొమ్మిది నగరాల్లో 2 ఆసుపత్రుల తో.. 3666 పడకల తో.. 1200 వైద్యుల తో.. 12 వేల మంది సిబ్బంది తో దేశం లోని అతి పెద్ద వైద్య సేవల సంస్థల్లో ఒకటి గా నిలవనుంది.

ఈ డీల్ విలువ రూ.362.78 కోట్లు గా చెబుతున్నారు. సన్ షైన్ ఆసుపత్రి విలువ ను రూ.730 కోట్లు గా అంచనా వేస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.75 కోట్ల ఆపరేటింగ్ లాభాన్ని నమోదు చేసినట్లు గా చెబుతున్నారు. కిమ్స్ కు హైదరాబాద్ తో పాటు నెల్లూరు.. రాజమహేంద్రవరం.. శ్రీకాకుళం.. ఒంగోలు.. వైజాగ్.. అనంతపురం.. కర్నూలు నగరాల్లో ఆసుపత్రులు ఉన్నాయి.

కిమ్స్ సికింద్రాబాద్ ఆసుపత్రి ఒక్క దాని లోనే వెయ్యి పడకలు ఉంటే.. కొండాపూర్ ఆసుపత్రి లో ఐదు వందలకు పైనే పడకలు ఉన్నాయి. ఈ రెండు ఆసుపత్రులు కలవటం సంతోషం గా ఉన్నట్లు సన్ షైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ గురవా రెడ్డి చెబుతున్నారు. మొత్తం గా హైదరాబాద్ మహా నగరం లోని రెండు పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు ఒకటి కానుండటం కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తి కర చర్చగా మారింది.