Begin typing your search above and press return to search.

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ బర్త్ డే స్పెషల్..!

By:  Tupaki Desk   |   5 Nov 2022 7:55 AM GMT
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ బర్త్ డే స్పెషల్..!
X
క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ లోనే అయినా భారతీయులకు ఈ ఆట బాగా కనెక్ట్ అయింది. మన జాతీయ క్రీడ హకీని మించి పాపులారిటీ సంపాదించుకుంది. భారత్ లో కోట్లాది మంది క్రికెట్ లవర్స్ ఉండటంతో ప్రపంచస్థాయి జట్లన్నీ కూడా టీం ఇండియాతో పోటీ పడేందుకు తహతహ లాడుతూ ఉంటాయి. అదేవిధంగా క్రికెట్ స్టార్స్ ఇక్కడి ఆతిథ్యాన్ని స్వీకరించేందుకు ఇష్టపడుతుంటారు.

ఇండియాలో క్రికెట్ అనేది మతం అనుకుంటే.. దానికి దేవుడిగా సచిన్ టెండ్కూలర్ నిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా సచిన్ ను ప్రతీఒక్కరూ క్రికెట్ గాడ్ గా అభివర్ణిస్తూ ఉంటారు. ప్రపంచ క్రికెట్లో సచిన్ నెలకొల్పిన రికార్డులు కొకోల్లలుగా ఉన్నాయి. అత్యధిక సెంచరీలు చేసిన రికార్డులు.. అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రికార్డులు.. తొలి డబుల్ సెంచరీ చేసిన రికార్డు సచిన్ పేరిటే ఉన్నాయి.

సచిన్ తర్వాత ఆ స్థాయిలో క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకుంది విరాట్ కోహ్లీనే. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పలువురు క్రికెటర్స్.. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో కింగ్ కోహ్లీకి విషెస్ చెబుతుండటంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. విరాట్ కోహ్లీ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది.

విరాట్ కోహ్లీ కెరీర్ తొలినాళ్లలో అద్భుతంగా కొనసాగింది. ధోని కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ టీం ఇండియాలో స్టార్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సచిన్ తరహా ఆట తీరును ఎంతోమంది అభిమానులను కోహ్లీ సంపాదించుకున్నాడు. అయితే గతేడాది కోహ్లీ తన ఫామ్ కోల్పోవడంతో అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇదే సమయంలో టెస్ట్, వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని బీసీసీఐ తప్పించింది. గత మూడేళ్ల నుంచి ఒక్క సెంచరీ కూడా కోహ్లీ ఖాతాలో లేకపోవడంతో అతడి పని అయిపోందనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ లో కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. అంతేకాకుండా అదే ఈవెంట్లో తనదైన స్టైల్లో బ్యాట్ ను ఝళిపించి సెంచరీ చేశాడు.

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీ అదిరిపోయే ఫార్మమెన్స్ ఇస్తున్నాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లో నాలుగు సిక్స్ లు.. ఆరు ఫోర్లతో 82 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ అజేయంగా నిలువడమే కాకుండా టీం ఇండియాను గెలిపించి ఛేజింగ్ లో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించాడు.

ఇక ఆ తర్వాత నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్ పై కూడా హాఫ్ సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. బ్యాక్ టు బ్యాక్ హాప్ సెంచరీలతో విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ఇటీవలే రికార్డు నెల్పాడు. విరాట్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా అతడి రికార్డులపై చర్చ నడుస్తోంది.

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 480 మ్యాచులు ఆడి 24వేల 350 పరుగులు చేశాడు. వీటిలో ఏడు డబుల్ సెంచరీలు.. 71 సెంచరీలు ఉన్నాయి. అలాగే 128 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కింగ్ కోహ్లీ తన కెరీర్లో 2419 ఫోర్లు.. 266 సిక్సర్లు బాదాడు. వన్డేలో నాలుగు.. టీ20లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్ గా కింగ్ కోహ్లీపై 100కు పైగా రికార్డు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.