Begin typing your search above and press return to search.
జర్మనీలో సొంత రాజ్యం స్థాపించిన కింగ్ పీటర్ ది ఫస్ట్..!
By: Tupaki Desk | 11 Dec 2022 2:30 PM GMTరాజులు .. రాజ్యాలు పోయి ఎన్నో ఏళ్లు గడిస్తున్నాయి. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట రాజరికం.. నియంత పాలన కనిపిస్తూనే ఉన్నాయి. బ్రిటన్ వంటి అగ్ర దేశంలో ఇప్పటి కూడా రాజరిక వ్యవస్థ నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు మినహా అంతా ప్రజాస్వామ్య పాలన నడుస్తోంది. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.
జర్మనీలోనూ ప్రజాస్వామ్య పాలనే నడుస్తోంది. అయితే ఆ దేశంలో ఓ వ్యక్తిగా ఏకంగా స్వాతంత్ర్య రాజ్యాన్ని స్థాపించి తానే రాజుగా ప్రకటించడం కోసం చర్చనీయాంశంగా మారింది. పీటర్ ది ఫస్ట్ అనే వ్యక్తి జర్మనీలో మేయర్‌గా.. పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి ప్రయత్నించి విఫలం చెందాడు.
జర్మనీలో అవినీతిపరులు.. నేరస్థులు.. అవసరానికి వాడుకునే వారే పైకి ఎదుగుతున్నారని విమర్శిస్తూ ప్రపంచంలో మార్పు తీసుకు రావాలని పిటర్ ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాడు. తనలా తపన పడే వాళ్లకు జర్మనీలో స్థానం లేదని భావించి కింగ్ పీటర్ కొత్త రాజ్యాన్ని స్థాపించి తనకు తానే రాజుగా ప్రకటించుకున్నాడు.
కింగ్ పీటర్ రాజ్యం తూర్పు జర్మనీలోని గ్రామీణ ప్రాంతం సరిహద్దుల్లో ఉంటుంది. దీనికి కొనికైష్ డాయిష్ లాండ్(జర్మనీ రాజ్యం) అని పేరు పెట్టాడు. దట్టమైన అడవుల మధ్య నెలకొని ఉన్న ఈ రాజ్యంలో పెద్ద కోట బురుజులు కన్పిస్తాయి. ఇక్కడి నుంచి కింగ్ పీటర్ తన పాలన కొనసాగిస్తున్నాడు.
కింగ్ పీటర్ కు దశాబ్దం కిత్రమే పట్టాభిషేకం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ సార్వభౌమత్వాన్ని అంగీకరించి వారంతా ఈ రాజ్యంలో నివసిస్తున్నారు. జర్మనీలో వీరిని 'రైస్ బర్గర్'గా పిలుస్తారు. వీరి సంఖ్య సుమారు 21 వేలు. ఈ రాజ్యానికి సొంతం ఎజెండా ఉంది. వారి డబ్బును వారే ముద్రించుకుంటారు. అలాగే సొంత ఐడీలు సైతం తయారు చేసుకున్నారు.
అయితే కింగ్ పిటర్ ఇటీవలి కాలంలో తన రాజ్యాన్ని క్రమంగా విస్తరిస్తున్నారు. జర్మనీలో భూములను కొనుగోలు చేసి ప్రజలకు అక్కడి తరలిస్తున్నారు. తన రాజ్యంలో 5వేల మంది ప్రజలు జీవిస్తున్నారని చెబుతున్న పీటర్ క్రమంగా రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. రాజభవనానికి 240 కి.మీ దూరంలో బర్దేల్ గ్రామం నిర్మించారు. ఈ ప్రాంతంలో ఒక పాత కోట ఉంది. ఇందులో 30 మంది నివసిస్తున్నారు.
వీరంతా కూడా పీటర్ రాజ్యంలో భాగమైనందుకు గర్వపడుతున్నట్లు చెబుతున్నారు. పీటర్ రాజ్యంలో పిల్లలను బడికి పంపరు.. ట్యాక్సులు కట్టరు. సొంత ఆరోగ్య వ్యవస్థ ఉండాలని భావిస్తారు. అయితే జర్మనీలో చట్ట విరుద్ధం. దీంతో పిటర్ జర్మనీలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణించాడని.. తన రాజ్యంలో ప్రజల సొమ్ము కాజేశారనే ఆరోపణలతో జర్మనీ అతడిని కొన్నేళ్లు జైల్లో ఉంచింది.
అయితే ఆ తర్వాత ఆ కేసును కోర్టు కొట్టివేసింది. తాజాగా పీటర్ ఇటీవల జర్మనీలో కుట్ర సిద్ధాంతాన్ని వ్యాపింపజేస్తున్నాడనే కారణంతో జర్మనీ రైష్ బర్గర్ పై దాడులు చేసి 25 మంది అరెస్టు చేసింది. దీంతో పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కింగ్ పిటర్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. తనకెమీ హింసాత్మక ఆలోచనలు లేవని.. జర్మనీకే విధ్వంసకర జబ్బు పట్టిందని ఆరోపించాడు.
ఇక త్వరలోనే సొంత టీవీ స్టూడియో కూడా తన రాజ్యంలో పిటర్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించాడు. మరోవైపు పిటర్ రాజ్యంలో ఏ ఒక్కరు కూడా కరోనా టీకా వేసుకోకుండా సొంత వైద్యాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. ఏది ఏమైనా ఆధునిక కాలంలోనూ ఓ వ్యక్తి సొంతంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసి రాజుగా ప్రకటించుకోవడం మాత్రం ఆసక్తిని రేపుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.