Begin typing your search above and press return to search.

అదీ.. సౌదీ చక్రవర్తి రాజసం

By:  Tupaki Desk   |   7 Sept 2015 9:38 AM IST
అదీ.. సౌదీ చక్రవర్తి రాజసం
X
ప్రపంచ ధనికుల్లో ఒకరైన సౌదీ చక్రవర్తి విదేశీ పర్యటన ఏ రేంజ్ లో ఉంటుందో తాజాగా ఆయన అమెరికా పర్యటనను చూస్తే తెలిసిపోతుంది. త్వరలో ఆయన అమెరికా పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లు చూసి సౌదీ చక్రవర్తి.. మజాకానా అనుకునే పరిస్థితి.

అమెరికా పర్యటనలో ఆయన బస చేయనున్న టోని జార్జ్ హోటల్ ఇప్పుడు మొత్తంగా చక్రవర్తి సల్మాన్ బిన్ అబ్దుల్ వారి సేవలకు అంకితం కావాల్సి ఉంటుంది. వాషింగ్టన్ లోని ఈ నాలుగంతస్థుల హోటల్ మొత్తం రాజుగారు బుక్ చేసుకున్నారు.

తన పర్యటనలో భాగంగా.. హోటల్ లోని సుమారు 222 గదుల్ని ఆయన ముందస్తుగా బుక్ చేసేశారు. దీంతో.. హోటల్ మొత్తం చక్రవర్తిగారి సేవలో పునీతం కావాల్సిందే. చక్రవర్తిగారి టోకు బుకింగ్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హోటల్ యాజమాన్యం.. చక్రవర్తి వారి మనసు దోచుకునే కార్యక్రమాలు మొదలు పెట్టింది. హెటల్ ని బంగారు అద్దాలు.. దీపాలతో ప్రత్యేకంగా అలంకరించటంతో పాటు.. రెడ్ కార్పెట్ ప్రత్యేకంగా పరిచి ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలని భావిస్తోంది.

అంతేకాదు.. తమ అతిధ్యంతో ఆయనకు మరిచిపోలేని అనుభవాన్ని ఇవ్వాలని కోరుకుంటోంది. అమెరికా పర్యటనలో భాగంగా చక్రవర్తివారు విడిది చేసే ఈ హోటల్ లో ఆయనతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు.. కీలక అధికారులు.. వ్యక్తిగత సిబ్బంది ఉండనున్నారు. ఏమైనా సౌదీ చక్రవర్తి వారి రాజసం ఏమిటో అమెరికన్లకు తెలియనుందని చెప్పక తప్పదు.