Begin typing your search above and press return to search.
రామ్మాహన్ నాయుడుకు మోదీ సర్ ప్రైజ్!
By: Tupaki Desk | 20 July 2017 1:03 PM GMTశ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఇచ్చిన వివాహ రిసెప్షన్ కు అనుకోని అతిథి హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడును ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆ కార్యక్రమానికి విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. బుధవారం రాత్రి స్థానిక హోటల్‌లో ఈ విందు అంగరంగ వైభవంగా జరిగింది.
ప్రధాని మోదీతోపాటు కేబినెట్ మంత్రులు ప్రకాశ్ జావడేకర్ - అరుణ్ జైట్లీ - సుమేష్ గోయల్ - అశోక గజపతి రాజు - బీజేపీ ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు - సుజనా చౌదరి కూడా ఆ రిసెప్షన్ కు హాజరయ్యారు. వీరందరూ నూతన దంపతులు - వారి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపారు. టీడీపీ - టీఆర్ ఎస్ - వైసీపీ - బీజేపీతోపాటు పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఈ విందుకు హాజరయ్యారు.
గత నెల 15న పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చిన్న కూతురు శ్రీ శ్రావ్యతో రామ్మోహన్ నాయుడు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన ఈ వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు - ఎమ్మల్యే బాలకృష్ణతో పాటు పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ఉత్తరాంధ్రలో టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించే కింజరపు ఎర్రన్నాయుడు అకాల మరణంతో రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. అనతి కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.