Begin typing your search above and press return to search.
పెళ్లికొడుకు అవుతున్న టీడీపీ ఎంపీ
By: Tupaki Desk | 20 Dec 2016 12:17 PM GMTఏపీ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ గా చెప్పే శ్రీకాకుళం ఎంపీ.. యువనేత కింజవరపు రామ్మోహన్ నాయుడు పెళ్లి పీటల మీదకు ఎక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. తండ్రి మాదిరి కాకున్నా.. తన వాగ్ధాటితో ఇప్పటికే పార్లమెంటులో తన వాణిని వినిపిస్తున్న రామ్మోహన్ నాయుడి పెళ్లి ముచ్చట ఇప్పుడు ఏపీ రాజకీయా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దివంగత మాజీ ఎంపీ ఎర్రం నాయుడి కుమారుడైన రామ్మోహన్ నాయుడికి.. విశాఖ పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యానారాయణ రెండో కుమార్తెతో సంబంధం నిశ్చయమైనట్లుగా తెలుస్తోంది.
ఎర్రంనాయుడి కుటుంబంతో చిరకాలంగా ఉన్న స్నేహం.. తాజా పరిణామాలతో బంధురికంగా మారనుందని చెబుతున్నారు. పెందుర్తిఎమ్మెల్యే రెండో కుమార్తె శ్రావ్యను పెళ్లి చేసుకునేందుకు రామ్మోహన్ నాయుడు ఓకే చెప్పేశారని.. పెళ్లికి సంబంధించిన తొలిదశ చర్చలు ముగిసినట్లుగా చెబుతున్నారు. ఈ పెళ్లి సంబంధానికి సంబంధించిన మాటలన్నీ ఎర్రం న్నాయుడి సోదరుడు.. వరుడి బాబాయ్ కమ్ ఏపీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది.
పెళ్లికి సంబంధించి పూర్తి మాటలు ఇంకా కాలేదని.. పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదన్న మాటను టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఈ వార్తపై పలువురు పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమైంది. కొందరైతే.. పెళ్లి కూతురు ఈమే అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. మరి.. నిజంగానే పెళ్లి కుమార్తె ఆమేనా? కాదా? అన్నది అధికారికంగా తేలాల్సి ఉంది. ఇక.. ఈ పెళ్లికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం ఇప్పటివరకూ బయటకు రాలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/