Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్‌ గా కిరణ్ బేడీ

By:  Tupaki Desk   |   22 May 2016 11:44 AM GMT
గ‌వ‌ర్న‌ర్‌ గా కిరణ్ బేడీ
X
తొలి మ‌హిళా ఐపీఎస్ అధికారిణిగా రికార్డు సృష్టించారు కిర‌ణ్ బేడికి మ‌రో గౌర‌వం ద‌క్కింది. బీజేపీ నాయ‌కురాలుగా ఉన్న కిర‌ణ్ బేడిని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. కిర‌ణ్‌బేడిని లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మిస్తూ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ నుంచి ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి.

1972 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కిర‌ణ్ బేడి కేంద్రంలో ప‌లు కీల‌క‌పోస్టులు నిర్వ‌ర్తించారు. ఆసియాలోనే అతిపెద్ద కారాగార‌మైన తీహార్ జైలుకు ఐజీగా కిర‌ణ్ బేడీ బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఆమె చేసిన ప్ర‌జాసేవ‌కుగాను రామ‌న్‌మెగ‌సెసె అవార్డు వ‌రించింది.

అయితే త‌న ప‌ద‌వీవిర‌మ‌ణ త‌ర్వాత కిర‌ణ్ బేడీ అన్నా హ‌జారే - అర‌వింద్ కేజ్రీవాల్‌ తో క‌లిసి లోక్‌పాల్ బిల్లు కోసం పోరాడారు. ఆ త‌ర్వాత బీజేపీలో చేరి 2015 ఢిల్లీ ఎన్నిక‌ల్లో సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. అయితే తను పోటీచేసిన కృష్ణాన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కిర‌ణ్ బేడి ఓట‌మిపాల‌య్యారు. అప్ప‌టి నుంచి ఈ మాజీ ఐపీఎస్ అధికారిణి క్రియాశీల రాజకీయాల‌కు ఒకింత దూరంగానే ఉన్నారు. తాజాగా జ‌రిగిన నామినేటెడ్ పోస్టుల పంప‌కంలో కిర‌ణ్ బేడీకి గ‌వ‌ర్న‌ర్ పీఠం ద‌క్కింది.