Begin typing your search above and press return to search.
'ఫాలో'' కావటం ఆమె అస్సలు ఇష్టపడటం లేదు
By: Tupaki Desk | 20 Jan 2015 11:15 AM GMTరాజకీయాలు అంతే.. నిన్నమొన్నటివరకూ కలిసి మెలిసి.. వాదనలు వినిపించిన వారు ఆగర్భ శత్రువుల మాదిరి పోట్లాడుకుంటారు. పరిస్థితులు కాస్త మారాలే కానీ.. అలాంటి వారు సైతం ఇట్టే కలిసిపోతారు. ఇప్పుడు మొదటిది జరుగుతోంది.
దేశరాజకీయాల్లో మార్పుకోసం.. అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్మించిన ఉద్యమంలో కీలకభూమిక పోషించిన వారిలో అన్నాహజారే టీంలోని కేజ్రీవాల్.. కిరణ్‌బేడీలు ఉండటం తెలిసిందే.
ఉద్యమ సమయంలో ఇద్దరు కలిసి తమ వాదనలు బలంగా వినిపించటమే కాదు.. దేశవ్యాప్తంగా వారు ఒక కొత్త ఒరవడికి దారి తీశారు. అవినీతిపై సమరశంఖం ఊది.. దేశంలోని యువతను రోడ్ల మీదకు తీసుకురావటంలో వారు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
తర్వాతి దశలో వారు.. వేర్వేరు రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహించటం.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా వీరిద్దరూ వేర్వేరు పార్టీల తరఫున పోటీ పడటంతో వీరి మధ్య విమర్శల తీవ్రత పెరిగింది. అది రాజకీయంగానే కాకుండా.. వ్యక్తిగతంగానూ కాస్త తీవ్రరూపం దాల్చిందనే చెప్పాలి.
కిరణ్ బేడీ ట్విట్టర్ ఖాతాను కేజ్రీవాల్ ఫాలో అవుతుంటారు. కానీ.. ఈ మధ్య కిరణ్‌బేడీపై ఆయన కాస్త తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో.. ఆమె తన ఖాతాలో అరవింద్ కేజ్రీవాల్ అకౌంట్‌ను బ్లాక్ చేశారు. దీంతో.. ఆయన.. ''కిరణ్‌జీ నేను మీ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతుంటాను. ఇప్పుడు మీరేమో బ్లాక్ చేశారు. ఆయన చేసి ఆన్ బ్లాక్ చేయండి'' అంటూ అడుగుతున్నా.. కిరణ్‌బేడీ మాత్రం ససేమిరా అంటున్నారట. చిన్నచిన్న విషయాల్లో మరీ అంత మొండితనం సరికాదేమో.