Begin typing your search above and press return to search.
కార్యకర్తలు గెలుస్తారా? పార్టీ గెలుస్తుందా?
By: Tupaki Desk | 22 Jan 2015 12:30 AM GMTఓట్లు అనేవి.. నాయకులను బట్టి వస్తాయా? లేదా, పార్టీని బట్టి ప్రజల్లో ఆదరణ ఉంటుందా? అనే కీలకమైన అంశానికి ఇప్పుడు మరోసారి లిట్మస్‌టెస్ట్ జరగబోతోంది. న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా... కృష్ణానగర్ నియోజకవర్గం అందుకు వేదిక కాబోతోంది. ఈ నియోజకవర్గం నుంచి తాజాగా భాజపా కేంద్ర నాయకత్వం తమ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీని పోటీకి నిలుపుతున్నట్లు ప్రకటించింది. తమ సీనియర్ నేత హర్షవర్దన్ అయిదుసార్లు ఏకబిగిన గెలిచిన ఈ నియోజకవర్గంలో గెలుపు గ్యారంటీ అనే నమ్మకంతో పార్టీ అక్కడ కిరణ్‌బేడీని మోహరించింది. అయితే.. స్థానికంగా ఇన్నాళ్లు టికెట్ ఆశిస్తూ వచ్చిన సతీశ్ మద్దతుదారులు నిరసనలు తెలియజేస్తున్నారు. సతీశ్ సర్దిచెబుతున్నా.. ఫలితం దక్కడం లేదు. భాజపా నిర్ణయాన్ని స్థానిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కార్యకర్తల వ్యతిరేకత భాజపాను పరాజయం పాల్జేస్తుందా? లేదా, భాజపాపై ప్రజాభిమానం కార్యకర్తల నిరసనల్ని తోసిరాజని బేడీని గెలిపిస్తుందా అనేది ఆసక్తికరంగా మారుతోంది.
పార్టీలు కార్యకర్తల మనోభిప్రాయాలతో నిమిత్తం లేకుండా... సరిగ్గా ఎన్నికల ముందు వలస వచ్చే నాయకులను తెచ్చి కొన్ని కీలక నియోజకవర్గాల మీద బలవంతంగా రుద్దడం అనేది ఇవాళ్టి టెక్నిక్ కాదు. ఇవాళ మాత్రమే రాజకీయాల్లో అనుసరిస్తున్న పద్ధతి కాదు. ఎప్పటినుంచో అన్ని పార్టీలు అనుసరిస్తున్న విధానమే. సాధారణంగా.. ఇలాంటి సడెన్ నాయకులు.. పార్టీకి అపారమైన బలం ఉన్న నియోజకవర్గాల్లోనే బరిలోకి దిగుతుంటారు. ప్రస్తుతం కిరణ్‌బేడీని కూడా అదే క్రమంలో కృష్ణనగర్‌లో దించుతున్నారు.
కాకపోతే ఇక్కడ టికెట్ ఆశించిన సతీశ్.. తాను అసలు ఎన్నికల్లో పోటీచేయదలచుకోలేదని.. రాష్ట్రమంతా తిరిగి పనిచేయదలచుకుంటున్నానని... పదేపదే ప్రకటిస్తున్నా.. పార్టీ కార్యకర్తలు మాత్రం ఊరుకోవడం లేదు. కేవలం పరిమితంగా ఉండే క్రియాశీల కార్యకర్తల్లో అసంతృప్తి అనేది ఏకంగా పార్టీకి ప్రజల్లో ఉండే ఆదరణను తోసిరాజని.. ఓడిపోయేలా చేయడం అంత సులువు కాకపోవచ్చు. అంత మాత్రాన.. పార్టీలు ఎప్పటికీ ఇదే తీరు అనుసరిస్తే పోతే మాత్రం.. ఇబ్బంది తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.