Begin typing your search above and press return to search.
గవర్నర్ కిరణ్ బేడీ వర్సెస్ సీఎం
By: Tupaki Desk | 5 Jun 2017 1:18 PM GMTఉప్పు..నిప్పు ఎంతలా చిటపటలాడుతుంటాయో.. అచ్చం కొందరు ముఖ్యమంత్రులు.. గవర్నర్ల మధ్య సంబంధాలు కూడా అచ్చం ఇలానే ఉంటాయి. ఒక్కక్షణం కూడా పడకుండా వారి మధ్య అనునిత్యం ఏదో ఒక విషయం మీద మాటల యుద్ధం సాగుతూ ఉంటుంది. పుదుచ్చేరి సీఎం.. గవర్నర్ల మధ్య సంబంధాలు కూడా ఇంచుమించే ఇదే తీరులో ఉన్నాయని చెబుతున్నారు.
ప్రభుత్వ వైఖరిని.. ముఖ్యమంత్రి నిర్ణయాల్ని సోషల్ మీడియాలో గవర్నర్ కిరణ్ బేడీ స్పందిస్తున్న వైనంపై అధికారపక్షంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడుతున్నారు. ఈ ఇరువురు ప్రముఖుల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం పుణ్యమా అని.. అధికారులు కిందామీదా పడుతున్నారు.
పీజీ మెడికల్ ఆడ్మిషన్ల ప్రక్రియలో గవర్నర్ కిరణ్ బేడీ జోక్యం చేసుకుంటున్నారని కొద్దిరోజుల క్రితం తప్పు పట్టిన ముఖ్యమంత్రి నారాయణ స్వామి తాజాగా అధికారులకు ఆంక్షలు విధించారు. తప్పనిసరైతే ప్రభుత్వ అనుమతి తీసుకున్నాక మాత్రమే గవర్నర్ ను కలవాలే తప్పించి.. విడిగా కలవొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై గవర్నర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
ముఖ్యమంత్రి ఏం కోరుకుంటున్నారని.. రబ్బర్ స్టాంపునా లేదంటే బాధ్యతాయుతమైన గవర్నరునా ? అంటూ సీఎంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు గవర్నర్ కిరణ్ బేడీ. ఇదిలా ఉంటే.. గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీని ఆ పదవి నుంచి తొలగించాలంటూ కేంద్రాన్ని సీఎం నారాయణస్వామి ఇప్పటికే కోరటం తెలిసిందే. మరి.. ఈ ఇద్దరు ప్రముఖ నేతల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం ఎంతవరకూ వెళుతుందన్నది ఆసక్తికరంగా మారిందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/