Begin typing your search above and press return to search.
భారీ ప్రకటనతో..టీడీపీలో చేరిన సీఎం తమ్ముడు
By: Tupaki Desk | 23 Nov 2017 6:40 PM GMTకొద్దికాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సీఎం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు తనయుడు అమర్‌నాథ్ రెడ్డి - అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఇటు చంద్రబాబు అటు నల్లారి కిషోర్ కుమార్ కూడా ఆసక్తికరమైన ప్రకటనలు చేశారని అంటున్నారు. టీడీపీలో చేరిన అనంతరం నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఉండేది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని అన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లాలో 14 స్థానాల్లోనూ టీడీపీ గెలిపించేందుకు కృషిచేస్తామన్నారు.
ఈ చేరిక సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ కిషోర్ తండ్రి నల్లారి అమర్ నాథ్ రెడ్డితో తాను కలిసి పనిచేశానని అన్నారు. విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్ కోసం గట్టిగా పనిచేశారన్నారు. జగన్, సోనియాలు కలిసి కపట నాటకమాడారని సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి చిత్తశుద్దితో పనిచేశారన్నారు. కిషోర్ కుమార్ రెడ్డి అనునిత్యం ప్రజలతోనే ఉంటారన్నారు. కుప్పంతో పోటీ పడి పీలేరులో కూడా మంచి మెజార్టీ రావాలన్నారు. ప్రజలకు సేవ చేసినప్పుడు వారు చూపే ఆదరణ ఎంతో ముఖ్యమన్నారు. కిషోర్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్ తనకు తెలియనిది కాదని..చిత్తూరు రాజకీయాలు నాకు తెలియనివి కావని చంద్రబాబు అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే కుంటి సాకులతో పారిపోయే పరిస్థితి ప్రతిపక్షానిదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మనీలాండరింగ్ లో 8వ స్థానంలో జగన్ ఉన్నాడని మీడియా రుజువు చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం పార్టీ బలోపేతం అవుతుందనేందుకు నిదర్శనమన్నారు.