Begin typing your search above and press return to search.

కనిపిస్తే కండువా కప్పివేత

By:  Tupaki Desk   |   16 Nov 2017 12:18 PM GMT
కనిపిస్తే కండువా కప్పివేత
X
ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ గిరాకీ లేని నేతలను కూడా చేర్చుకుంటోంది. ఫేడవుట్ అయిపోయిన నాయకులు, అన్ని పార్టీల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించి ఎటూకాకుండా ఉండిపోయినవారిని... చాలాకాలంగా తెరమరుగైపోయినవారిని కూడా చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి ని చేర్చుకునేందుకు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కిశోర్ కుమార్ రెడ్డి ఈరోజు భేటీ కానున్నారు. అదే సమయంలో ఆయన చేరిక ఉండొచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కిశోర్ కుమార్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అమర్ నాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరుతున్నట్టు సమాచారం. నిజానికి నల్లారి కుటుంబానికి చిత్తూరు జిల్లా పీలేరులో ఒకప్పుడు మంచి పట్టుండేది. కానీ... విభజన తరువాత ఆయన కొత్త పార్టీ పెట్టి ఫెయిలవడం.. గత మూడేళ్లుగా నల్లారి సోదరులు లైమ్ లైట్ లో లేకపోవడంతో క్యాడర్ చెదిరిపోయింది. దీంతో వీరి చేరిక వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న వాదనా వినిపిస్తోంది.

మరోవైపు సినీ జంట జీవిత, రాజశేఖర్ లు కూడా టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు పార్టీలలో పనిచేసిన వీరు... మళ్లీ టీడీపీలోకి వస్తున్నారని... చంద్రబాబు అందుకు పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. రీసెంటుగా ఓ కార్యక్రమంలో జీవితను చంద్రబాబు పార్టీలో చేరమని అడగ్గా ఆమె సరేనన్నట్లు సమాచారం. చాలాకాలంగా సినిమాల్లోనూ సక్సెస్ లేకుండా ఉన్న రాజశేఖర్ తాజాగా గరుడవేగ సినిమాతో భారీ హిట్ కొట్టారు. మళ్లీ ఫాంలోకి రావడంతో ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా పున:ప్రవేశం చేయాలని వారు కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వీరు ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, బీజేపీలను చూడడంతో రాజకీయంగా స్థిరులు కారన్న అభిప్రాయం వీరిపై ఉంది.