Begin typing your search above and press return to search.
అడ్రస్ గల్లంతు అయిన మాజీ సీఎం
By: Tupaki Desk | 22 March 2019 5:52 AM GMTమాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అడ్రల్ లేకుండా పోయారు. ఇటీవల ఆయన సొంత పార్టీ జై సమైక్యాంధ్ర వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.. కానీ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే రాజంపేట పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే టీడీపీ – కాంగ్రెస్ అధికారిక పొత్తు లేకపోవడంతో రాజంపేట నుంచి టికెట్ రాలేదు. ఫలితంగా ఆయన మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కిరణ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో మళ్లీ లాబీయింగ్ చేసే అవకాశం ఉంది. ఆయనకు సొంతంగా కేడర్ లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పెద్దల వద్ద మంచి పేరు ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలోనే ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ సీఎం పదవి కట్టబెట్టారని అప్పట్లో వార్తలు వినిపించాయి.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. రాజకీయాల్లో ఎవరికీ రాని అదృష్టం.. ఉన్నఫలంగా పొందిన నాయకుడు. ఎన్నో ఏళ్లు ఎదురు చూస్తే కానీ లభించని ముఖ్యమంత్రి పదవిని హఠాత్తుగా పొందారు. అయితే అదృష్టంగా వచ్చిన పదవిని నాలుగేళ్లు అనుభవించారు. కానీ అనంతరం అడ్రస్ లేకుండా పోయారు. ఆరంభం నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. తగిన ప్రతిఫలం పొందారని చెప్పవచ్చు. చిత్తూరు జిల్లా వాయల్పాడు నియోజకవర్గం నుంచి 1989 - 1999 - 2004 నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. అయితే 1994లో ఓడిపోయారు.
2004 నుంచి 2009 వరకు ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో విప్ గా పని చేశారు. అనంతరం నియోజకవర్గాల పునర్ విభజనలో భాగంగా వాయల్పాడును పీలేరు నియోజకవర్గంలో కలిపారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో 2009లో పీలేరు నుంచి గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్ పదవి సంపాదించారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో కె.రోశయ్య రాజీనామా చేయగానే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.
2010 నుంచి 2014 మార్చి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కూడా ఆయనే. అయితే తన హయాంలో రాష్ట్రం విడిపోవడం చాలా బాధకరమని.. సీఎం పదవికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పేరుతో సొంతంగా పార్టీ పెట్టారు. అయితే రాష్ట్రంలో టీడీపీ – వైఎస్సార్ సీపీ పుంజుకోవడంతో గెలవడం కష్టమని భావించిన మాజీ సీఎం తాను కూడా పోటీ చేయలేదు. సొంత నియోజకవర్గం పీలేరులో జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున ఆయన సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డిని బరిలో దింపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అభ్యర్థులను పోటీ చేయించారు. కానీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. ఎన్నికల అనంతరం కిరణ్ రాజకీయంగా ప్రజల్లోకి రాలేదు. ఇంటికే పరిమితం అయ్యారు.
సొంత పార్టీ ప్రభావం లేకపోవడం.. వేరే పార్టీలోకి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తనను సీఎంను కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆఫర్ ఇచ్చినట్లు అయింది. ఏపీలో టీడీపీ – కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని ప్రచారం సాగింది. ఈ క్రమంలో దాదాపు నాలుగేళ్లు స్తబ్దుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి 2018 జూలైలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ – కాంగ్రెస్ పొత్తు ఉంటే తనకు రాజంపేట పార్లమెంట్ టికెట్ కావాలని అడిగినట్లు కూడా ప్రచారం సాగింది. అయితే టీడీపీ – కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగడంతో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఆయన సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో చేరిపోయారు.
కిరణ్ కుమార్ రెడ్డి – కొన్ని విశేషాలు
నాలుగుసార్లు ఎమ్మెల్యే – 1989 - 1999 - 2004 - 2009
పదవులు – ప్రభుత్వ విప్ (2004 – 2009) - స్పీకర్ (2009 – 2010)
సీఎం – 2010 – 2014 వరకు
రాజకీయం – ఆరంభం నుంచి కాంగ్రెస్ - 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపన. అనంతరం సొంత గూటికి (కాంగ్రెస్) చేరిక.