Begin typing your search above and press return to search.
కిరణ్ రావ్ తెలంగాణ అమ్మాయంట
By: Tupaki Desk | 26 Nov 2015 4:13 AM GMTదేశంలో అసహనం ఎక్కువ అవుతోంది.. మనం దేశం విడిచి వెళ్లిపోదామన్న మాటను తన భర్త.. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చెప్పటం.. ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడి కావటంతో అమీర్ భార్య కిరణ్ రావ్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. అమీర్ రెండో భార్యగా సుపరిచితమైన కిరణ్ రావ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదుర్కొన్నది లేదు. ఇప్పటివరకూ కిరణ్ రావ్ వ్యక్తిగత విషయాలపై పెద్దగా ఫోకస్ చేయని వారు.. ఇంతకీ ఈమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈమె మూలాలు ఏంటని వెతికిన వారికి సరికొత్త విషయాలు తాజాగా బయటకు వచ్చాయి.
దేశవ్యాప్తంగా కొత్త చర్చను రేపి.. రాత్రికి రాత్రి సూపర్ హీరో ఇమేజ్ ఉన్న భర్తను.. వివాదాల్లోకి నెట్టేసినట్లుగా అమీర్ అభిమానులు భావిస్తున్న కిరణ్ రావ్ తెలంగాణకు దగ్గర బంధుత్వం ఉన్న విషయం బయటకు వచ్చింది. నిజానికి ఆమె మూలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆమె పూర్వీకులు తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజవంశీకులన్న కొత్త విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
కిరణ్ తాత మహబూబ్ నగర్ లోని వనపర్తి రాజవంశీకులు. కిరణ్ తండ్రి వైపు వారిది తెలంగాణ ప్రాంతమే. కిరణ్ తండ్రి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో భాగంగా బెంగళూరు.. కోల్ కతా.. ముంబయి లాంటి మహానగరాల్లో పని చేశారు. దీంతో.. కిరణ్ రావ్ తెలంగాకు కాస్త దూరంగా మహానగరాల్లో చదువుసంధ్యలు సాగాయి. ముంబయిలోని సోఫియా కాలేజీలో డిగ్రీ చేసిన కిరణ్ రావ్.. మాస్ కమ్యూనికేషన్ డిగ్రీని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నుంచి పొందారు. అనంతరం సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ప్రముఖ దర్శకులు అశుతోష్ గోవర్కర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు.
అమీర్ ఖాన్ నిర్మించిన లగాన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కిరణ్ రావ్.. ఈ సినిమా షూటింగ్ లో అమీర్ కు పరిచయమై.. అది స్నేహంగా మారి చివరకు అమీర్ తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చి.. కిరణ్ రావ్ ను పెళ్లి చేసుకునేలా చేసింది. వీరి వివాహం 2002లో జరిగింది. వీరికి అజాద్ అనే కొడుకు ఉన్నాడు. 1973 బెంగళూరులో పుట్టిన కిరణ్ రావు తల్లిదండ్రులు ప్రస్తుతం గార్డెన్ సిటీలోనే ఉంటున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి.. అమీర్ తో పెళ్లి అయిన తర్వాత ఆమె.. అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో ధోబీ ఘాట్ అనే సినిమాను తన దర్శకత్వంతో నిర్మించారు. తారే జమీన్ పర్.. జానే తు.. యా జానేనా.. తలాష్.. పీప్లీ లైవ్.. ఢిల్లీ బెల్లీ లాంటి చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. ఇలా సాగుతున్న కిరణ్ రావు.. తన భర్తతో చేసిన వ్యాఖ్య దేశంలో పెద్ద దుమారాన్నే రేపింది.