Begin typing your search above and press return to search.

మహిళా ఎంపీ వింత ప్రవర్తన.. నెటిజన్ల ఫైర్

By:  Tupaki Desk   |   11 Jan 2019 5:31 AM GMT
మహిళా ఎంపీ వింత ప్రవర్తన.. నెటిజన్ల ఫైర్
X
దేశానికి ప్రాతినిధ్యం వహించే ఎంపీలు ఎంత హుందాగా ప్రవర్తించాలి.. కానీ మన ఎంపీలు మాత్రం చిల్లర చేష్టలతో అభాసుపాలవుతున్నారు. ఆ మధ్యే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభలో కన్ను గీటి.. మోడీని కౌగిలించుకొని నవ్వుల పాలయ్యారు. ఇప్పుడు అగ్రవర్ణాల్లోని పేదలకు మేలు చేసే బిల్లు చర్చ సందర్భంగా ఓ మహిళ ఎంపీ ప్రవర్తన విమర్శలకు తావిచ్చింది..

చండీఘడ్ ఎంపీ కిరణ్ ఖేర్ అగ్రవర్ణాలకు బిల్లు సందర్భంగా చర్చలో మాట్లాడుతూ హాస్యాస్పదంగా ప్రవర్తించారు. ఖేర్ నవ్వుతూ.. ఎవరికో సైగలు చేస్తూ.. మరో సభ్యుడితో మాట్లాడుతూ కనిపించారు. నిండు సభలో అన్ని కెమెరాలున్నాయన్న సోయి మరిచి వెకిలి చేష్టలు చేశారు. ఇప్పుడామె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆమెను ఆడుకుంటున్నారు. ఆమె హావాభాలు - విచిత్ర ముఖకవళికలను ఏకిపారేస్తున్నారు. ఎంపీగా పార్లమెంట్ లో ఉండాల్సిన వారు కాదని.. కాలేజీలో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ గా కూర్చోవాలంటూ హితవు పలుకుతున్నారు..

ఎంపీ చేష్టలు ఇండియాజ్ గాట్ టాలెంట్ షో జడ్జిగా ఉందంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్ చేస్తున్నారు. తన ప్రవర్తనపై స్పందించడానికి ఎంపీ ఖేర్ మాత్రం నిరాకరించారు.