Begin typing your search above and press return to search.

లాక్‌డౌన్ సడలింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ..ఏంచెప్పారంటే ?

By:  Tupaki Desk   |   28 April 2020 11:10 AM GMT
లాక్‌డౌన్ సడలింపులపై  క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ..ఏంచెప్పారంటే ?
X
కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌ డౌన్ గడువు మే 3వ తేదీతో ముగియనుంది.. అయితే, సోమవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలతో పాటు, లాక్‌ డౌన్ పొడిగింపుపై కూడా అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే, లాక్ ‌డౌన్ పొడిగింపుపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సడలింపు పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ..హాట్ స్పాట్, రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ కొనసాగుతుంది అని, వైరస్ ప్రభావం లేని జిలాల్లో లాక్ డౌన్ తీసివేస్తామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వాలని కేంద్రం ఆలోచిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. దీనిపై మే 2 లేదా 3వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రులు అభిప్రాయాన్ని మోడీ తీసుకున్నారని తెలిపారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ తో కూడా చర్చించి.. వైరస్‌ను అరికట్టే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అయితే, రైళ్లు, విమానాలు లాంటి ప్రజా రవాణా వ్యవస్థలు పనిచేయవు అని క్లారిటీ ఇచ్చారు కిషన్‌రెడ్డి.. స్కూళ్లు, విద్యాసంస్థలు, పెద్ద సంఖ్యలో భక్తులు దేవాలయాలకు వెళ్లడం, మత పరమైన సమావేశాలను అనుమతించే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

ప్రభుత్వాలు తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, చర్యలకు అనుగుణంగా ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని కోరారు.. ఇది, మన భవిష్యత్తు కోసం, మన రక్షణ కోసమే, అనేక దేశాలతో పోల్చి చూసుకుంటే, భారత దేశంలో కరోనా ప్రభావం చాలా తక్కువ గా ఉంది అని తెలిపాడు. దేశంలో అనేక ప్రాంతాలలో చిక్కుకు పోయిన తెలుగువారిని వారికున్న ఇబ్బందులు, సమస్యల తీవ్రతను బట్టి స్వస్థలాలకు చేర్చే ప్రయత్నం చేస్తామన్నారు. వైరస్ తీవ్రత దృష్ట్యా అన్ని కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో పని చేస్తాయని తెలిపారు. జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ స్థాయి అధికారి హోదాతో 30 శాతం సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు.