Begin typing your search above and press return to search.

ఎవ‌రో చీటీ ఇచ్చేస్తే మోడీ మాట్లాడ‌తారా కిష‌న్‌?

By:  Tupaki Desk   |   18 March 2018 6:13 AM GMT
ఎవ‌రో చీటీ ఇచ్చేస్తే మోడీ మాట్లాడ‌తారా కిష‌న్‌?
X
బీజేపీ నేత‌ల్లో ఫ‌స్ట్రేష‌న్ లెవెల్స్ అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ తిరుగులేని అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ.. వ‌చ్చేసార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపు ప‌క్కా అన్న‌ట్లుగా ఫీలైన వారికి.. గ‌డిచిన వారంలో వారి స్థైర్యాన్ని దెబ్బ తీసే ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌టం.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అవిశ్వాసం.. ప‌వ‌న్ నిప్పులు చెర‌గ‌టం.. బీజేపీతో ఉన్న బంధానికి చంద్ర‌బాబు క‌టీఫ్ చెప్ప‌టం.. కంచుకోట లాంటి సీట్ల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ దారుణంగా ఓట‌మిపాలు కావ‌టం లాంటివి క‌మ‌ల‌నాథుల‌కు కొత్త కంగారును తెచ్చి పెట్టాయి.

త‌మ‌ను తెగ ఇబ్బంది పెడుతున్న అంశాల‌పై బీజేపీ నేత‌లు మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ హ‌డావుడిలో తామేం మాట్లాడుతున్నామ‌న్న విష‌యాన్ని వారు మ‌ర‌చిపోతున్నారు.

తాజాగా కిష‌న్ రెడ్డి వ్య‌వ‌హార‌మే తీసుకోండి.. త‌న‌కు ఏ మాత్రం సంబంధం లేని ఏపీ ప్ర‌త్యేక హోదా మీద నోరు విప్పి.. ఆంధ్రోళ్ల చేత తిట్టించుకునే ప‌ని చేస్తున్నారు. ఆంధ్రోళ్లే కాదు.. తెలంగాణ వాళ్లు కూడా కిష‌న్ రెడ్డిని తిట్ట‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే.. ఆయ‌న మాట‌లు అలా ఉన్నాయి మ‌రి.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని మోడీ తిరుప‌తి స‌భ‌లో చెప్పిన దానిపై కిష‌న్ కొత్త మాట చెప్పుకొచ్చారు. ఆ స‌భ‌లో ఎవ‌రో ఇచ్చిన చీటిని చూసి చ‌దివేశార‌ని.. అప్ప‌ట్లో ఏపీపై అవ‌గాహ‌న లేద‌ని.. ఇప్పుడు ఫుల్ అవ‌గాహ‌న ఉన్న‌ట్లు చెప్పారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒక జాతీయ పార్టీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఉన్న నేతకు ఎవ‌రో వ‌చ్చి చీటి ఇవ్వ‌టం ఏమిటి? ఆయ‌న వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడి.. హామీ ఇవ్వ‌టం ఏమిటి? న‌మ్మ‌టానికి కూడా వీల్లేన‌ట్లుగా ఉన్న కిష‌న్ రెడ్డి మాట‌లు చూస్తేనే ఆయ‌నేం చెప్పాల‌నుకుంటున్నారో అర్థ‌మ‌వుతుంది. ఇలాంటి మాట‌లు ఆయ‌న ఇమేజ్ ను డ్యామేజ్ చేయ‌ట‌మే కాదు.. మోడీకి ద‌న్నుగా నిల‌వాల‌నుకునే ప్ర‌య‌త్నంలో ఆయ‌న అడ్డంగా మునిగిపోతార‌న్న వాస్త‌వాన్ని గుర్తిస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.