Begin typing your search above and press return to search.
భారీ పంచ్ వేసేందుకు సారుకు ఛాన్స్ ఇచ్చిన కిషన్ రెడ్డి
By: Tupaki Desk | 27 Sep 2019 6:06 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి అధినేతను ఉద్దేశించి విమర్శలు చేసే విషయంలో ఆచితూచి అన్నట్లుగా మాట్లాడాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. చిన్న మాట తేడాను ఎంత రచ్చ చేయొచ్చో కేసీఆర్ మాటల్ని విన్నప్పుడు ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కావాలంటే కలుపుకుపోవటం.. వద్దనుకుంటే వదులుకోవటం గులాబీ బాస్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. అంతేకాదు.. ఎమోషనల్ వ్యాఖ్యలతో ఎదుటోళ్ల ఆరోపణల్ని ఎటకారం చేయటంలో కేసీఆర్ ప్రావీణ్యం తెలిసిందే.
తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. ఇష్టారాజ్యంగా ఖర్చు చేయటమా? అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్వశ్చన్ చేయటం బాగానే కనిపిస్తుంది. కానీ.. ఇలాంటి మాటలు మాట్లాడే వేళ.. అందుకు చూపించే ఉదాహరణ కేసీఆర్ కు ఛాన్స్ ఇచ్చేలా ఉండకూడదు.
కానీ.. కిషన్ రెడ్డి ఆ విషయంలో తప్పు చేశారన్న మాట వినిపిస్తోంది. తాజాగా కేసీఆర్ ను విమర్శించే క్రమంలో ఆయన తెర మీదకు తీసుకొచ్చిన పోలిక బాగాలేదని.. ఇలాంటి విషయాల్ని అవకాశంగా తీసుకొని మాటలతో ఆడేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు అనవసర ఖర్చు ఎందుకు? అంటూ కిషన్ రెడ్డి క్వశ్చన్ వరకూ బాగానే ఉంది కానీ.. తర్వాత చెప్పిన పోలికే నప్పలేదంటున్నారు.
తాజాగా ఏపీ ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా సీఎంకు.. ఏపీ మంత్రులకు వెండి బహుమతులు ఇవ్వటం ఏమిటంటూ ప్రశ్నించిన తీరు బాగోలేదంటున్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి బహుకరించిన దాన్ని ఖరీదైన ఖర్చుగా చెప్పటాన్ని రానున్న రోజుల్లో కేసీఆర్ నుంచి భారీ పంచ్ తప్పదంటున్నారు. తనను కలిసిన వారిని శాలువాలు కప్పి బహుమతులు ఇవ్వటం కేసీఆర్ కు అలవాటేనని.. ఇప్పుడు కొత్తగా ఏమీ లేదంటున్నారు.
ఆ లెక్కకు వస్తే.. ప్రధాని మోడీకి సైతం ఇదే తరహాలో బహుమతులు ఇచ్చామని.. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని కేసీఆర్ గుస్సా ప్రదర్శిస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని కిషన్ రెడ్డి ఆలోచించుకోవాలంటున్నారు. చిన్న చిన్న విషయాల్ని తప్పులుగా ఎత్తి చూపించే బదులు.. ప్రజాధనం భారీగా వేస్ట్ అయ్యే అంశాల్ని సమర్థంగా ప్రస్తావిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.