Begin typing your search above and press return to search.

ఎంఐఎంకు కానుక‌..అసెంబ్లీ ఎదుట ఖాసీం ర‌జ్వీ

By:  Tupaki Desk   |   17 Sep 2018 9:03 AM GMT
ఎంఐఎంకు కానుక‌..అసెంబ్లీ ఎదుట ఖాసీం ర‌జ్వీ
X
సెప్టెంబ‌ర్ 17 వస్తోందంటే చాలు తెలంగాణ‌లో విలీన దినోత్స‌వం కేంద్రంగా విమ‌ర్శ‌లు ప‌దును ఎక్కుతాయి. ప్ర‌ధానంగా అధికార టీఆర్ ఎస్ పార్టీ - ప్ర‌తిప‌క్ష బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతుంది. విలీన దినోత్స‌వం జ‌రుపుతామ‌ని హామీ ఇచ్చిన కేసీఆర్ దాన్ని నిల‌బెట్టుకోవ‌డం - త‌మ ఓటు బ్యాంకు కాపాడుకోవ‌డం ఎజెండాగా బీజేపీ దుమ్మెత్తిపోసే సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇదే ప‌రిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ ఎస్ ముందస్తు నిర్ణయం నేపథ్యంలో సీఎంను - టీఆర్ ఎస్‌ కుటుంబాన్ని...బలిదానం అయిన కుటుంబాల - ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాన‌ని పేర్కొన్నారు. విమోచన ఉద్యమాన్ని బ్రహ్మాండంగా జరుపుతాను అన్న హామీ ఎందుకు అమలు చెయ్యలేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలను మట్టిలో కలిపిన మీకు ప్రజల నుండి ఓటు అడిగే నైతిక హక్కు ఉందా కేసీఆర్ అని ప్ర‌శ్నించారు.

తెలంగాణ యోధుల బలిదానాలను మరిచి మజ్లీస్ మద్దతు కోరి ఓటు ఎలా అడుగుతారని కిష‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. అప్పటి కాంగ్రెస్ సీఎంలకు నేటి కేసీఆర్ మాటలకు పెద్ద తేడా ఏమీ లేద‌ని ఎద్దేవా చేశారు. ``సెప్టెంబర్ 17 విమోచనం జరపడం లేదు కాబట్టి... పోరాట యోధులకు ఇచ్చే పెన్షన్లు రద్దు చేస్తారా? ర‌జాకర్లకు సర్టిఫికెట్ ఇస్తారా? అసెంబ్లీ ఎదురుగా స‌ర్దార్ పటేల్ విగ్రహం తీసి వేసి.. ఖాసీంరజ్వీ విగ్రహం పెడతారా? నిజాం మీద పోరాటం చేసిన పవార్ - గంగారాం - ఐలమ్మ - కొమురం భీంలను రాజద్రోహులుగా - దేశ ద్రోహులుగా ముద్ర వేస్తారా? `` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. విమోచన సంబరాలను చేసుకోవడం నేరం అవుతుందేమో కేసీఆర్ వెల్ల‌డించాల‌న్నారు. రాజకీయ లాభాల కోసం - ఓటు బ్యాంక్ ఎత్తుగ‌డ‌ల్లో భాగంగా కాంగ్రెస్ బాటలోనే మజ్లీస్‌ తో దోస్తానా చేస్తూ తెలంగాణ అమరవీరులకు ద్రోహం చేయవ‌ద్ద‌ని కేసీఆర్‌ కు కిష‌న్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

రజాకార్ల వారసులతో కుమ్మక్కై మతోన్మాదాన్ని - గుండాయిజాన్ని టీఆర్ ఎస్ పెంచుతోంద‌ని కిష‌న్ రెడ్డి ఆరోపించారు. తెరాస అంటే తెలంగాణ రజాకార్ల సమితి అని - ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిన టీఆర్ ఎస్‌ పార్టీ జూటా పార్టీ అని విరుచుకుప‌డ్డారు. దివాలకోరుతనంతో వ్యవహారిస్తు టీఆర్ ఎస్‌ ను ప్రశ్నించి.. ఓడించాల్సింది గా.. ప్రజలను కోరుతున్నాన‌ని కిష‌న్ రెడ్డి అన్నారు. ``కేసీఆర్ కుటుంబ సభ్యులు భ్రమిత్ షా అంటు అవహేళన చేశారు. కేసీఆర్ కుటుంబ అవివేకానికి - అహంకారానికి ఇది నిదర్శనం. అమిత్ షా ప్రజల సమస్యలను ప్ర‌స్తావిస్తూ కేంద్రం ఇచ్చిన సహకారం మాత్రమే చెప్పారు. సమాధానం చెప్పలేక విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేటీఆర్‌ కు అమిత్ షా ను విమర్శించే స్థాయి లేదు. కేసీఆర్ కుమారుడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాడు. కేసీఆర్ కొడుకువు కాబట్టే.. నువ్వు మంత్రివి - నీకు పెత్తనం. అదే లేకపోతే అమెరికాలో ఉద్యోగం చేసుకునే వ్య‌క్తివి`` అని దుమ్మెత్తిపోశారు.