Begin typing your search above and press return to search.
ఫ్లాపైన `ఫామ్‌హౌస్ ఫైల్స్`: కిషన్ రెడ్డి సటైర్లు మామూలుగా లేవుగా
By: Tupaki Desk | 27 Dec 2022 3:37 PM GMTఎప్పుడూ గంభీరంగా మాట్లాడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సటైర్లు కుమ్మరించారు. కేసీఆర్ తీసిన ఫామ్ హౌస్ ఫైల్స్ ఫ్లాప్ మూవీ అని ఎద్దేవా చేశారు. ఫామ్‌హౌస్ ఫైల్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం.. బీజేపీని భయపెట్టించే విధంగా అనేక కుట్రలు చేసిందన్నారు. కేసీఅర్ తన అస్తిత్వం కాపాడుకోవడం కోసం ఇతరులపై కుట్రలు పన్నడం ఆయకు వెన్నతో పెట్టిన విద్య అని కిషన్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదన్నారు.
కేసీఆర్ కుటుంబానికి ప్రత్యామ్నాయంగా ఎవరైనా ఎదుగుతుంటే దెబ్బతీస్తున్నారని కిషన్ మండిపడ్డారు కేసీఆర్ దర్శకత్వంలో రూపొందించిన ఫామ్ హౌస్ ఫైల్స్ సినిమాలో పస లేదని, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మొట్టికాయలు వేసిందని, నోటీసుల పేరుతో ప్రజలను మభ్య పెట్టాలని చూశారని అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయిపోయిందని దుయ్యబట్టారు.
కోర్టులు మొట్టికాయలు పెట్టినా చీమ కుట్టినట్లైనా లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. గారడీ మాటలతో మసిపూసి మారేడుకాయ చేయడం కేసీఆర్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కథ, స్కీన్‌ప్లేతో ప్రజలకు 'ఫైల్స్' సినిమా చూపించారని, కానీ, అది ఆయనకు కూడా బోర్ కొట్టిందని ఆరోపించారు. కేసీఆర్ తప్పుడు కేసులతో రాద్దాంతం చేశారని వెల్లడించారు.
ఎలాంటి ఆధారాల్లేని కేసులో సిట్ వేశారని కేంద్రమంత్రి కిషన్ ఆరోపించారు. తప్పుడు కేసును సీరియల్ లాగా సాగదీశారని విమర్శించారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కేసు ప్రాథమిక దశలో ఉన్నప్పుడే వీడియోలు సీఎంకు ఎలా చేరాయని ప్రశ్నించారు. ఓ వైపు కేసు విచారణ జరుగుతున్నప్పుడే దుష్ప్రచారం ప్రారంభించారని వివరించారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేల ఫోన్లు రికవరీ చేయలేదని, ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు రికవరీ చేయలేదో కేసీఆర్ ఇప్పటికీ సమాధానం చెప్పలేదని కిషన్ అన్నారు. ఎమ్మెల్యేలను వారాల పాటు ప్రగతి భవన్లో ఎందుకు బంధించారో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.