Begin typing your search above and press return to search.
యువరాజు పేరును మార్చిన కిషన్ రెడ్డి
By: Tupaki Desk | 18 Feb 2016 5:24 AM GMTఢిల్లీలోని జేఎన్ యూ వ్యవహారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కరెంటు షాక్ కొట్టినట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూలో రచ్చ రచ్చ చేసిన రాహుల్ గాంధీ.. తనకు తాను జేఎన్ యూలోనూ యాక్టివ్ గా పాల్గొని పీకల్లోతు కష్టాలు కొని తెచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఉగ్రవాది అఫ్జల్ గురు వర్ధంతిని జేఎన్ యూ వర్సిటీలో నిర్వహించటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వ్యవహారంపై బీజేపీ సహా పలువురు నేతలు మండిపడుతున్నారు. రాహుల్ తన పేరు పక్కన యాకూబ్ మెమన్ కానీ.. అఫ్జల్ గురు కానీ చేర్చుకోవాలంటూ సూచిస్తున్నారు. ఉగ్రవాదుల్ని సమర్థించే వారికి.. దేశ సమగ్రతను విచ్చిన్నం చేసే కార్యక్రమాల్ని నిర్వహించే వారిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్.. కమ్యూనిస్ట్ మేధావులు సమర్థించటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధినేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ తన పేరును రాహుల్ యాకూబ్ గా లేదా అఫ్జల్ రాహుల్ గురు అని మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్న రాహుల్.. కమ్యూనిస్ట్ నేతలపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్నవారు దేశ భక్తుల మాదిరి కనిపిస్తున్నారా? అని సూటిగా అడిగిన కిషన్ రెడ్డి.. పాకిస్థాన్ కు అనుకూల నినాదాలు చేయటాన్ని సమర్థిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. మరి.. కిషన్ రెడ్డి సంధించిన ప్రశ్నలకు రాహుల్ సమాధానం చెబితే బాగుంటుందేమో..?