Begin typing your search above and press return to search.

కేసీఆర్‌, స‌త్యం రామ‌లింగ‌రాజు ఒక‌టే!

By:  Tupaki Desk   |   28 March 2017 10:13 AM GMT
కేసీఆర్‌, స‌త్యం రామ‌లింగ‌రాజు ఒక‌టే!
X
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల‌ను విజ‌యవంతంగా(!) ముగించిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ కు ఊహించ‌ని కామెంట్ ఎదురైంది. ఐటీ రంగంలో తెలుగు తేజంగా ఎదిగి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన స‌త్యం రామ‌లింగ‌రాజుతో కేసీఆర్‌ ను పోల్చారు బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత కిషన్ రెడ్డి. ఎందుకు ఈ ఇద్ద‌రి మ‌ధ్య లింకు పెట్టేశారు? ఏ విష‌యంలో ఒక‌నాటి ఐటీ దిగ్గ‌జానికి పోలిక అంటే కిష‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన కార‌ణం చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిష‌న్ రెడ్డి. బ‌డ్జెట్లో అవాస్త‌వ అంకెలు ఎన్నో ఉన్నాయ‌ని కిష‌న్ రెడ్డి త‌ప్పుప‌ట్టారు. కృత్రిమ అంకెలు పెంచి, సత్యం రామలింగ రాజు చేసిన మోసం వ‌లే కేసీఆర్ సైతం చేశార‌ని అన్నారు. స‌త్యం రామ‌లింగ‌రాజు చేసి దానికి ..సీఎం చేసిన దానికి తేడా ఏమిటో చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. అప్పులు తెచ్చి రెవిన్యూ చూపించిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కిందని ఎద్దేవా చేశారు.

సీఎం కేసీఆర్ అబద్దాలు చెప్పి-బడ్జెట్ ఎక్కువ చేసి చూపించి.. బంగారు తెలంగాణ అని లేని గొప్పలు చెప్పుకొనే తెలంగాణగా మార్చేశార‌ని కిష‌న్ రెడ్డి మండిప‌డ్డారు. అద్భుతమైన అప్పుల తెలంగాణ చేశార‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. అనేక సంవత్సరాల సంప్రదాయాల‌ను తుంగ‌లో తొక్కుతూ అతి తక్కువ సమయం తక్కువ రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వ‌హించార‌ని మండిప‌డ్డారు. కుర్చీ నుండి కదలని టీడీపీని మొత్తం స‌మావేశాలు పూర్త‌య్యే వ‌ర‌కు సస్పెండ్ చెయ్యడం అప్రజాస్వామికమ‌ని అన్నారు. పైగా త‌మ వ‌ల్ల‌నే స‌మావేశాలు బాగా జ‌రిగాయ‌ని ప్రభుత్వం చెప్పుకోవ‌డం విడ్డురమ‌ని కిష‌న్ రెడ్డి అన్నారు. ప్ర‌తిపక్షాల వలన మాత్రమే సభ సజావుగా సాగిందని కిష‌న్ రెడ్డి తెలిపారు. పాలక పక్షం నియతృత్వంతో ఎదురుదాడి చేసిందని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించినందుకు ప్రజాస్వామ్యం ఖూనీ చేసేలా రెండు రోజుల పాటు బీజేపీ ని సస్పెండ్ చెయ్యడం సహకరించడం అవుతుందా అని ప్ర‌శ్నించారు. తెరాస ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎదురు దాడి చేస్తూ.. గోల, అరుపులు, పెడ బొబ్బలు... చేసిన మంత్రుల వల్లనా బాగా జరిగిందనేది వారు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

సాగునీటి ప్రాజెక్ట్ ల లో అవినీతి ని ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులు అంటున్నారని కిష‌న్ రెడ్డి అన్నారు.సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో అంతా గందరగోళమే ఉంద‌న్నారు. ఇష్టా రాజ్యాంగ బడ్జెట్ అంచ‌నాలు పెంచి అవినీతికి పాలపడుతున్నార‌ని మండిప‌డ్డారు. మంత్రులు శాసనసభ లో దండాలు పెట్టి నటిస్తున్నారని, సీఎం గారు నటించడం నేర్పిస్తున్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు మాటలు, దాట వేసే ధోరణితో అన్ని ప‌క్క‌దోవ ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇప్పటికి అనేక గ్రామాలలో కేంద్రం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ కాలేదని కిష‌న్ రెడ్డి మండిప‌డ్డారు. గురుకులాల విద్య పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే దొర్భాగ్య స్థితి బంగారు తెలంగాణ లో ఉందని ఎద్దేవా చేశారు. మద్యం అమ్మకాల లాభం మీద మమకారం, అప్పుల మీద, కేంద్ర మీద భారం ఇది ప్రభుత్వ విధాన‌మ‌ని మండిప‌డ్డారు. చెట్టు మీద కూచొని విస్తర్లు కుట్టినట్టుగా ప్రభుత్వం తీరు ఉంద‌ని మండిప‌డ్డారు. కాగ్ రిపోర్ట్..సమావేశాల మొదటి రోజే ఇవ్వాలి ఉండ‌గా సమావేశాలు అయిపోయాక.. బడ్జెట్ ఆమోదం పొందాకా ఇచ్చార‌ని కిష‌న్ రెడ్డి త‌ప్పుప‌ట్టారు. ముస్లింలను బీసీలలో కలపడం ద్వారా బీసీలకు మేలు చేస్తున్నారా..లేక అన్యాయం చేస్తున్నారా చెప్పాల‌ని డిమాండ్ చేశారు. బీజేపీ తరపున రాజకీయంగా, న్యాయ పరంగా చివరి వరకు పోరాటం చేసి .. ముస్లిం రిజ‌ర్వేషన్స్ అడ్డుకుంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కేజీ టు పీజీ మానస పుత్రిక అని చెప్పిన కేసీఆర్ దాని పురోగ‌తి ఏమిటో ఎందుకు చెప్ప‌డం లేద‌ని కిష‌న్ రెడ్డి నిల‌దీశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/