Begin typing your search above and press return to search.
కేటీఆర్ పై పోస్ట్...కిషన్ రెడ్డి క్లారిటీ ఇది
By: Tupaki Desk | 28 Jun 2017 10:18 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - ఆయన తనయుడు-రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై బీజేపీ శాసన సభా పక్ష నాయకుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బంగారు తెలంగాణ - విశ్వనగరంగా హైదరాబాద్ అని ప్రచారం చేసిన టీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడు మహానగరం స్థాయిని కూడా కాపాడలేకపోతోందని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ ను మెరుగుపరుస్తాం అని ప్రచారం చేసి టీఆర్ ఎస్ ఓట్లు వేయించుకొని ఇప్పుడు మురుగుపాలు చేసిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మూడేళ్లలో హైద్రాబాద్ లో రోడ్లు అయినా బాగు చేశారా సమాధానం చెప్పాలని నిలదీశారు.
సీఎం కేసీఆర్ - ఆయన తనయుడైన మంత్రి కేటీఆర్ గాలి లో మేడలు కడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి హైద్రాబాద్ ను అమెరికా - యూరోప్ - ఇస్తాంబుల్ చేస్తా.. విశ్వనగరంగా చేస్తాం అన్నారని సీఎం ప్రయాణం చేసే రోడ్లు కూడా గతుకులు - గుంతలు అయినా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ విదేశాల్లో తిరుగుతూ అలానే హైదరాబాద్ ఉందనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమెరికాను వదిలేసి హైదరాబాద్ ను చూస్తే సిటీ ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని తెలుస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌పై సోషల్ మీడియా లో జోక్స్ వేసుకుంటున్నారని తెలిపారు. ఇదేనా విశ్వనగరం అంటూ కామెంట్లు చేస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీ తనం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. వారానికోసారి కూడా మంచి నీళ్ళు రావడం లేదని, వీధి లైట్లు కూడా లేవని ఆక్షేపించారు. మెట్రోరైలు పని పడకేసిందని, పండుగలకు కూడా సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. ఎక్కడ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పని జరగడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఉస్మానియా, గాంధీ లాంటి ఆసుపత్రుల్లో మరణాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేరిందా అని టీఆర్ఎస్ నేతలు ఆలోచించుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/