Begin typing your search above and press return to search.
కిషన్ రెడ్డి ఎందుకు కలకలం సృష్టిస్తున్నారు?
By: Tupaki Desk | 26 Jun 2017 10:38 AM GMTతెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సిద్ధమవుతున్న బీజేపీకి అప్పుడే ఇంటిపోరు మొదలయినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత - బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు కిషన్ రెడ్డి కారణంగా పార్టీలో అసంతృప్తి రాగం ముదిరిపాకాన పడిందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి ఉన్నన్నాళ్లూ హల్ చల్ చేసిన కిషన్ రెడ్డి పదవీ కాలం ముగియగానే పార్టీ కార్యక్రమాలకు హాజరవడం బాగా తగ్గించేశారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇదే విషయమై పలువురు నేతలు ఫిర్యాదు చేయడంతో కిషన్ రెడ్డిపై క్లాస్ తీసుకున్నట్లు టాక్ వినిపించింది. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకాని కిషన్ రెడ్డి ఇటీవల సహచర నేతలపై చిర్రుబుర్రులాడుతున్నారని అంటున్నారు.
అమిత్ షా పర్యటన నేపథ్యంలో పార్టీ నేతలంతా తెలంగాణలో పర్యటించారు. ఆ తదుపరి పార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడి టూర్ పై రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. అయితే విస్తారక్ కార్యక్రమానికి హాజరైన కిషన్ రెడ్డి ఆ తర్వాత జరిగిన రివ్యూ మీటింగ్ కి మాత్రం డుమ్మా కొట్టారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు - పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా హాజరైనా కిషన్ రెడ్డి మాత్రం లైట్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ముందుగా సమాచారమిచ్చి పెట్టిన విలేకరుల సమావేశాలను సైతం చివరి నిమిషంలో రద్దు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు మీడియా సమావేశం పెట్టారు. అదేరోజు కిషన్ రెడ్డి విలేకరుల సమావేశం కూడా ఉంది. దీంతో ఒకేరోజు ఒకే పార్టీ నేతలు రెండు వేర్వేరుగా ప్రెస్ మీట్ లు పెట్టడం వల్ల పార్టీ ఇమేజ్ ఏం కావాలంటూ కిషన్ రెడ్డి ఫైరయ్యారని ప్రచారం జరుగుతోంది.
అధ్యక్షుడిగా పదవీ కాలం అయిపోయినప్పటికీ పార్టీలో ఏం జరిగినా అన్నీ తనకు తెలిసి జరగాలన్న భావనలోనే ఇంకా కిషన్ రెడ్డి ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సీనియర్ గా పార్టీకి సహకరించాల్సింది పోయి ఇలా చేయడం పార్టీకి - నాయకుడిగా ఆయనకు సైతం నష్టం చేకూర్చేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/