Begin typing your search above and press return to search.

చిరుని టెంప్ట్ చేస్తున్న కిషన్ రెడ్డి

By:  Tupaki Desk   |   25 Sep 2015 9:39 AM GMT
చిరుని టెంప్ట్ చేస్తున్న కిషన్ రెడ్డి
X
అధికార బీజేపీ దిశగా చిరు అడుగులు పడుతున్నాయా? అన్న ప్రశ్న ఇప్పటికే వెలువడినా.. దాని మీద మరింత చర్చ జరిగే అవకాశం ఇచ్చారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మీద కోపంగా ఉన్నారని.. పార్టీకి గుడ్ బై చెప్పేసి కాషాయం కండువా వేసుకునే అవకాశం ఉందంటూ ఓ పక్క వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

దీనిపై చిరంజీవి కానీ.. ఆయన వర్గాలు ఎవరూ కూడా స్పందించింది లేదు. కానీ.. కిషన్ రెడ్డి మాత్రం తాజాగా రియాక్ట్ అయి.. చిరంజీవి లాంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తానంటే ఆనందంగా వెల్ కం చెబుతామంటూ వ్యాఖ్యానిస్తున్నారు. చిరంజీవి లాంటి ప్రజాకర్షక నేత తమ పార్టీలోకి రావాలని భావిస్తే.. తాము నిండు మనసుతో స్వాగతిస్తామని కిషన్ రెడ్డి అంటున్నారు.

పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలోకి రావాలన్న ఆలోచన చిరంజీవిలో ఉందో లేదో తెలీదు కానీ.. కిషన్ రెడ్డి మాటలు చూస్తుంటే మాత్రం పార్టీ మారాలన్న భావన కలిగేలా టెంప్ట్ చేస్తున్నారని చెబుతున్నారు. వేడిగా ఉన్నప్పుడు సరిగా దెబ్బ పడితే అనుకున్న షేప్ లోకి ఇనుమే కాదు.. మనుషులు కూడా వస్తారన్న విషయం కిషన్ రెడ్డికి తెలీదా ఏంటి..?