Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ లో తల్లి ప్రథమ వర్థంతి.. కేంద్రమంత్రి సంచలనం

By:  Tupaki Desk   |   13 April 2020 3:30 AM GMT
ఆన్ లైన్ లో తల్లి ప్రథమ వర్థంతి.. కేంద్రమంత్రి సంచలనం
X
ఆయనో కేంద్రమంత్రి. లాక్ డౌన్ వేళ.. తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా.. నలుగురికి ఆదర్శంగా నిలవటమే కాదు.. ఇదే తరహా స్ఫూర్తిని దేశ ప్రజలు ప్రదర్శించాలన్న తీరుకు తెర తీశారు. పవర్ చేతిలో ఉన్నప్పుడు వ్యవస్థల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు భిన్నంగా వ్యవహరించారు. తన తల్లి ప్రథమ వర్థంతిని ఆన్ లైన్ లో నిర్వహించాలన్న వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

కరోనాను కంట్రోల్ చేయాలంటే లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని భావిస్తున్న వేళ.. 21 రోజులకు లాక్ డౌన్ విధించారు. ఈ గడువు పూర్తి అవుతున్న వేళ.. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తన తల్లి ఆండాలమ్మ ప్రథమ వర్థంతికి హైదరాబాద్ కు చేరుకోలేని పరిస్థితి. దీంతో.. ఆయన తల్లి ప్రథమ వర్థంతిని ఆన్ లైన్లో నిర్వహించాలని డిసైడ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో ఈ రోజు (సోమవారం) ప్రథమ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే.. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి తన స్వగ్రామానికి చేరుకోలేని దుస్థితి. దీంతో తన కుటుంబ సభ్యులు తిమ్మాపూర్ లో.. కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి ఆన్ లైన్ ద్వారా ప్రథమ వర్థంతి కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. పవర్ లో ఉన్న వారు మాటల్లోనే కాదు.. చేతల్లోనూ పాటిస్తే.. ఇలాంటివి చోటు చేసుకుంటాయి.