Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ పొడిగింపు పై కిషన్ రెడ్డి ఏంచెప్పారంటే?
By: Tupaki Desk | 8 April 2020 10:30 AM GMTదేశంలో కరోనా మహమ్మారిని అరికట్టడానికి ..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నకీలకమైన నిర్ణయం లాక్ డౌన్. ఈ లాక్ డౌన్ వల్ల కరోనా దేశంలో వేగంగా విస్తరించకుండా అడ్డుకోగలిగాం. ఈ లాక్ డౌన్ గడువు ..ఏప్రిల్ 14 తో ముగియబోతుంది. కానీ, దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ..ఈ లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడగించాలంటూ కేంద్రాన్ని కోరుతున్నారు.
ఈ విషయంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించి పలు కీలక విషయాలు తెలియజేసారు. లాక్ డౌన్ పొడిగింపు అంశంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ మేధావులతో మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ విపత్కర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించాలన్న విషయంపై కేంద్రప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ విషయంపై ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు అని తెలిపారు.
కరోనాను లాక్ డౌన్ ద్వారా మాత్రమే అరికట్టగలం అని ,ప్రజలంతా దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనవసరమైన కారణాలతో రోడ్డుపై తిరగొద్దని సూచించారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర లాక్ డౌన్ ను అమలు చేస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా ఆహార కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇకపోతే కరోనా కట్టడి కాకపోవడంతో ..లాక్ డౌన్ పొడిగించాలని ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.