Begin typing your search above and press return to search.

రమేష్ కుమార్ లేఖపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్య!

By:  Tupaki Desk   |   20 March 2020 8:50 AM GMT
రమేష్ కుమార్ లేఖపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్య!
X
ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ పేరుతో ఒక లేఖ మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ కావటం.. అందులో తనకు ప్రాణహాని ఉందని.. తనకు కేంద్రం రక్షణ కల్పించాలని.. అవసరమైతే హైదరాబాద్ లోనే తాను ఉంటానన్నట్లుగా అందులో పలు సంచలన అంశాలు ఉన్నాయి. ఈ లేఖ రమేశ్ కుమార్ పేరిట విడుదల కావటంతో ఆయనే రాశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. ఈ లేఖను మీరే రాశారా? అంటూ రమేశ్ కుమార్ ను ఏపీకి చెందిన పలు మీడియా సంస్థలు ఆరా తీయగా.. ఆయన తాను రాయలేదన్నారు.

ఇదిలా ఉంటే.. రమేశ్ కుమార్ పేరుతో తిరుగుతున్న లేఖ.. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వద్దకు చేరినట్లుగా తెలుస్తోంది. తాజాగా తనకు వచ్చిన లేఖపైన ఏపీ రాష్ట్ర సీఎస్ తో పాటు.. హోంశాఖ ముఖ్య కార్యదర్శితోనూ మాట్లాడినట్లు చెప్పారు. తనకురమేశ్ కుమార్ పేరుతోనే లేఖ వచ్చినట్లుగా కిషన్ రెడ్డి స్పష్టం చేయటం ఆసక్తికరంగా మారింది.

తనకు వచ్చిన లేఖకు అనుగుణంగా రమేశ్ కుమార్ కు రక్షణ కల్పిస్తామన్న ఆయన..అధికారులపై బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. వీలైతే లిఖితపూర్వక ఆదేశాల్ని రాష్ట్రానికి పంపుతామన్నారు. ఎవరైనా అధికారుల్ని బెదిరించాలని భావిస్తే.. కేంద్రం ఊరుకోదన్న కిషన్ రెడ్డి.. రమేశ్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారని.. ఆయనకు పూర్తి రక్షణ కల్పించినట్లు చెప్పారు. ఆయన కానీ ఏపీకి వెళితే పూర్తి రక్షణ సీఎస్ కు చెబుతామని చెప్పారు.ఏపీ డీజీపీతోనూ మాట్లాడతామని చెప్పారు. ఓవైపు మీడియా సంస్థలకు తాను రాయలేదన్న లేఖ మీద కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఈ రీతిలో మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. మరి.. దీనిపై రమేశ్ కుమార్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.