Begin typing your search above and press return to search.
అలా డైరెక్టుగా అడిగితే ఎలా?
By: Tupaki Desk | 7 April 2015 6:19 AM GMTనల్లగొండ జిల్లాలో ముష్కరుల కాల్పులు...అందులో అమాయకులైన పోలీసులు అసువులు బాయడం, కాల్చింది దోపిడి దొంగలే కానీ ఉగ్రవాదులు కాదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పోలీసులు చెప్పడం అంతా ఆసక్తికరంగా ముగిసిన ఘట్టం.
అయితే కాల్పులు జరిపింది ఎవరో ఖరారు చేయడంలో కాల్పుల కంటే పెద్ద ట్విస్టులు నడిచాయి. కాల్చింది దోపిడి దొంగలు అని హోంమంత్రి ఉదయం చెపితే... మధ్యాహ్నం వారు తీవ్రవాదులని డీజీపీ తేల్చేశారు. తనకు సమచారం లేకపోవడం వల్ల ఈ విధంగా మాట్లాడానని హోంమంత్రి సెలవిచ్చారు! దీంతో పాటు మరోమంచి మాట కూడా చెప్పారు. ఏం జరిగినా హైదరాబాద్ కు ముడిపెట్టి మాట్లాడుతున్నారని, ఇది సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
అంత కర్కశంగా వ్యవహరించిన వారు దోపిడి దొంగలేనని ఎలా చెప్పబుద్దయిందని ప్రశ్నిస్తున్నారు. వారు ఉగ్రవాదులేనని చెప్పేందుకు సర్కారు భయమా అంటూ నిలదీశారు.
హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ప్రభుత్వానికి తెలియకపోయినా...ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల విషయంలో సరైన విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి అంత నేరుగా అడిగితే ఎవరైనా ఏం చెప్తారు పాపం!