Begin typing your search above and press return to search.
కిషన్‌రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఓ వైపు..ఉత్తమ్, కోమటిరెడ్డి ఇంకో వైపు
By: Tupaki Desk | 9 July 2021 2:30 AM GMTగంగాపురం కిషన్ రెడ్డి... ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ మంత్రి. ఎనుముల రేవంత్ రెడ్డి... తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు. బండి సంజయ్.... బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి... తాజాగా పీసీసీ బాధ్యతలు అప్పజెప్పిన నాయకుడు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి. ఈ ఐదుగురు నేతల్లో ఓ సారుప్యత ఉంది. ఇందులో కిషన్‌రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఓ వైపు..ఉత్తమ్, కోమటిరెడ్డి ఇంకో వైపు ఉన్నారు.
కిషన్‌రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీలు అనే సంగతి తెలిసిందే. వీరు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇకపోతే వీరంతా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయి... ఎంపీలుగా గెలుపొందిన వారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తెచ్చిన ముందస్తు ఎన్నికల వల్ల షాక్ తిని... అనంతరం వచ్చిన ఎంపీ ఎన్నికల్లో జాక్ పాట్ కొట్టిన నేతలనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపోతే వీరిలో ముగ్గురు నేతల స్టార్ ఓ రకంగా ఉంటే మరో ఇద్దరిది ఇంకో రకంగా ఉంది.
బీజేపీ నేత గంగాపురం కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచిన అనంతరం ప్రస్తుతం జరిగి మంత్రివర్గ విస్తరణ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడు అయ్యారు. ఆసక్తికరంగా ఈ ఇద్దరు నేతలు ఒకే రోజు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ప్రమోషన్ కొట్టేశారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే, ఇటీవల పీసీసీ బాధ్యతలకు గుడ్ చెప్పేయగా తాజా ఆయనకు విముక్తి లభించింది. అప్పజెప్పిన నాయకుడు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ. టీపీసీ రథసారథి పోస్ట్ కోసం పెద్ద ఎత్తున్నే ప్రయత్నం చేశారు. అయితే, ఆయనకు నిరాశే ఎదురైంది. మొత్తంగా ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ఎంపీలుగా గెలిచిన నేతలకు ముగ్గురికి ప్రమోషన్ దక్కితే..మరో ఇద్దరికి నిరాశ ఎదురైంది.