Begin typing your search above and press return to search.

కరోనా అలర్ట్ :దేశంలో లక్ష మందికే వెంటిలేటర్లు..కిషన్ రెడ్డి!!

By:  Tupaki Desk   |   24 March 2020 11:47 AM GMT
కరోనా అలర్ట్ :దేశంలో లక్ష మందికే వెంటిలేటర్లు..కిషన్ రెడ్డి!!
X
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు - ఆ నిర్ణయాలకు తగట్టుగా రియాక్ట్ అవుతోన్న ప్రజలని చూస్తుంటే కరోనా పై ఇండియా తప్పకుండా విజయం సాధిస్తుంది అని చెప్పవచ్చు. కానీ, ఇదే సమయంలో దేశంలో కరోనా ప్రభావం ఏమాత్రం పెరిగినా కూడా జనాలు పిట్టలు రాలినట్టు రిలిపోవడం ఖాయం అని కూడా తెలుస్తుంది. తాజాగా కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి వెల్లడించిన ఒక నిజం తెలిస్తే ..ప్రజల్లో భయాందోళన కలుగక తప్పదు. ఎందుకు అంటే ..130 కోట్లకి పైగా జనాభా కలిగిన ఈ సువిశాలమైన భారతదేశంలో ఉండేది కేవలం లక్ష వెంటిలేటర్లు మాత్రమే. ఇది సాక్ష్యాత్ కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి చెప్పిన సంఖ్యనే.

గత ప్రభుత్వాలు వైద్య సౌకర్యాల కల్పనలో ఎలా విఫలం అయ్యాయో.. అత్యవసర పరిస్థితులు ఎదురైనపుడు సిద్ధంగా ఉండేందుకు ఏమి చేయలేకపోయాయి అన్న విషయం దీని ద్వారా తేటతెల్లం అవుతుంది. ఇంత పెద్ద దేశంలో ఇంత తక్కువ వైద్య సౌకర్యాలు ఉన్నాయి. దీనితో మనముందున్న ఏకైక మార్గం ..ప్రభుత్వ సూచనలు పాటించడం.

ఇక ఇదే సందర్భంలో కిషన్ రెడ్డి మరిన్ని అంశాలను వెల్లడించారు. ప్రధాని పిలుపునకు కులాలు - మతాలకు - సిద్ధాంతాలకు - పార్టీలకు అతీతంగా 130 కోట్ల మంది ప్రజలు ఎలా స్పందించారో అలాగే ఇకపై కొనసాగించాలని, వచ్చే 2 వారాలు చాలా కీలకమైనవని - ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా దేశం కరోనా స్టేజి 3 దశకు వెళ్లదన్న ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. ఇటలీ - అమెరికా వంటి దేశాలే స్టేజి-3కి వెళ్లాయని - అక్కడి ప్రజలు ప్రభుత్వాల సూచనలని పాటించలేదు కాబట్టే ప్రస్తుతం అక్కడ అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని తెలిపారు.

తెలుగు ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలని కిషన్ రెడ్డి కోరారు.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 లక్షల 24 వేల 266 మందికి స్క్రీనింగ్ చేశామని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో 492 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. 37 మంది డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. 69వేల 436 మందిని హౌస్ క్వారంటైన్ చేశామన్నారు. 20,707 మంది శాంపిల్స్‌ టెస్ట్ చేశామని - ల్యాబ్‌ ల సంఖ్యను 118కి పెంచామని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 94,963 క్వారంటైన్ బెడ్లను సిద్ధం చేశామన్నారు. ప్రతి రోజు 20వేల మందికి కరోనా టెస్టులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే, కేంద్రం ఖర్చుతో 48 దేశాల నుంచి 2040 మంది భారీతీయులను తీసుకొచ్చామన్నారు.