Begin typing your search above and press return to search.
కేటీఆర్ పై అదిరిపోయే సెటైర్ పడింది
By: Tupaki Desk | 1 Sep 2016 12:58 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - రాష్ట్రమంత్రి కేటీఆర్ పై బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి అదిరిపోయే సెటైర్ వేశారు. పురపాలక శాఖా మాత్యులుగా ఉండటమే కాకుండా హైదరాబాద్ ఇంచార్జీ మంత్రిగా కేటీఆర్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కురిసిన వర్షం కారణంగా హైదరాబాద్ లో నగర ప్రజల జీవనం అతలాకుతలం అవడాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావిస్తూ...హైదరాబాద్ యువతకు వరద నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను కోరి తద్వారా పంచ్ వేశారు. విశ్వనగరం పేరు చెప్పి నగరాన్ని విషాద నగరంగా మార్చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
జీహెచ్ ఎంసీ ఎన్నికలలో ప్రజలకు మాయ మాటలు చెప్పి గెలిచారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. స్కై వేలు నిర్మిస్తాం - లండన్ లా చేస్తాం అన్నవారు ఇప్పటివరకు ఏం చేసారని ప్రశ్నించారు. ఎక్కడకి వెళ్ళినా చెత్త కుప్పలు దర్శనం ఇస్తున్నాయని మండిపడ్డారు. నాళాలు కుచించుకు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే ట్రాఫిక్ జాం - కరెంటు కట్ తప్పడం లేదని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ పర్యటన ఉందనే సమాచారం రాగానే రోడ్లపై గుంతలను పూడుస్తూ మేనేజ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రెండేళ్లలో పోలీస్ లకు కార్లు తప్ప ఏమి చేయలేదని మండిపడ్డారు. కేటీఆర్ వెళ్తుంటే సీఎం వస్తున్నట్లు అధికారులు ట్రాఫిక్ ని నిలిపివేస్తారని కిషన్ రెడ్డి తప్పు పట్టారు. అలా దర్జాగా కాకుండా సామాన్యుల వలే ట్రాఫిక్ లో వెళితే కష్టాలు తెలుస్తాయని మండిపడ్డారు. అందుకే టీఆర్ ఎస్ సర్కారు చేతకానితనం నుంచి నగరాన్ని కాపాడుకునేందుకు హైదరాబాద్ బచావ్ పేరుతో బీజేపీ ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ క్రమంలో తమతో కలిసి రావాలని, తద్వారా నగరాన్ని రక్షించుకుందామని నగర వాసులకు కిషన్ రెడ్డి సూచించారు.