Begin typing your search above and press return to search.
రేవంత్ ఎంత కామెడీ అయిపోయాడో
By: Tupaki Desk | 17 July 2016 10:06 AM GMTతెలంగాణలో అధికార పక్షమైన టీఆర్ ఎస్ కు బీజేపీ & కాంగ్రెస్ పార్టీలు అనుబంధ సంఘాలుగా మారాయని, ఇక ఆ పార్టీలు ఉండి ప్రయోజనం ఏమిటని తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి. కిషన్ రెడ్డి ఈ కామెంట్లపై స్పందిస్తూ టీడీపీని లైట్ తీసుకున్నారు. #తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదు. లేని పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై ఏమని స్పందించాలి?’ అంటూ రేవంత్ రెడ్డితో సహా టీడీపీకి రివర్స్ పంచ్ వేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని సమస్యలపై తాము ఉద్యమిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. తమ పార్టీ ఒంటరిగానే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నదని ఆయన తెలిపారు. తద్వారా బీజేపీతో ముందుకు సాగేది లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే రేవంత్ విషయం ప్రస్తావించగా....లేని పార్టీ నేత గురించి మాట్లాడుకోవడం ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా...హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. విశ్వనగరం పేరు చెప్పి విషాద నగరంగా మార్చుతున్నారని విమర్శించారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని మజ్లిస్ నేత - లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశద్రోహులకు - సంఘ వ్యతిరేక శక్తులకు మద్దతిస్తున్న ఓవైసీ విధానాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపడతామని ప్రకటించారు.