Begin typing your search above and press return to search.
కిషన్ రెడ్డి వెబ్ సైట్ హ్యాక్...ఎన్ని రోజులు అయిందో తెలుసా?
By: Tupaki Desk | 25 Aug 2020 5:09 PM GMTకేంద్ర ప్రభుత్వానికి పాక్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఏకంగా, కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాక్ చేశారు. పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్స్ ఈ కుట్రకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, హ్యాకింగ్ తాజాగా తెరమీదకు వచ్చినప్పటికీ ఇది 10 రోజులుగా జరుగుతోందని సమాచారం. ఆగస్ట్ 15 నుంచి ఆయన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో దేశ వ్యతిరేక సందేశాలు వస్తున్నాయని గమనించిన సిబ్బంది వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైనట్లు నిర్ధారించింది.
సాక్షాత్తు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెబ్ సైట్ హ్యాక్ అవడంతో కేంద్ర వర్గాలు ఉలిక్కి పడ్డాయి. దీంతో తక్షణం స్పందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ కావడంతో దేశ భద్రతకు సంబంధిచిన ఎలాంటి సమాచారం అందులో లేదని సమాచారం. కేవలం పార్టీ, ఆయన వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక నిపుణుల సహాయంతో వెబ్‌సైట్‌ను హ్యాకింగ్ బారి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. పాక్ టెక్ ముష్కరులు విసిరిన సవాల్‌కు మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.