Begin typing your search above and press return to search.
క్లాస్ రూంలో టీచర్ కు ముద్దులే ముద్దులు.. వైరల్ వీడియో
By: Tupaki Desk | 13 Sep 2022 1:46 PM GMTక్లాస్ రూంలో పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతాకాదు.. చింత బరిగెలతో పిల్లలను మన చిన్నప్పుడు చితక్కొట్టి మరీ టీచర్లు పాఠాలు చెప్పేవారు. పిల్లల అల్లరికి వారి వీపులు విమానం మోత మోగేది. టీచర్లు మరీ కఠినంగా ఉండేవారు అప్పట్లో. ఆ తర్వాత కొట్టిన టీచర్లపై తల్లిదండ్రుల దాడులతో వారు అస్సలు కొట్టడమే మరిచిపోయారు. ఇప్పుడు అల్లరి చేస్తున్న పిల్లలను కంట్రోల్ చేయడానికి టీచర్లు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు..
కానీ ఇక్కడో టీచరమ్మ చిన్న పిల్లలను సముదాయించడం ఎలాగో చూపించింది. తాను అలక వహించి పిల్లలతోనే క్షమాపణ చెప్పింది. అల్లరి చేస్తున్నావంటూ నొచ్చుకున్న టీచర్ ను బుజ్జగిస్తున్న ఓ చిన్న నర్సరీ కుర్రాడు చేసిన పని వైరల్ అయ్యింది.
అల్లరి చేస్తున్న ఓ చిన్న పిల్లాడు ఆమెకు క్షమాపణలు చెబుతున్న వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎక్కడ జరిగిందో స్పష్టత లేని ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయగా ప్రస్తుతం అది ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.
‘ఎంత చెప్పినా నువ్వు అల్లరి చేస్తూనే ఉన్నావ్. అల్లరి చేయనంటూనే మళ్లీ మళ్లీ చేస్తున్నావ్’ అంటూ ఉపాధ్యాయురాలు ఆ చిన్నారి తీరు పట్ల నొచ్చుకొని అలుగుతుంది. ‘ఇకపై నీతో మాట్లాడను’ అంటూ ఆమె పేర్కొంటుంది.
దీనికి చిన్నారి స్పందిస్తూ.. ఇకపై ఎప్పుడూ అల్లరి చేయబోనంటూ ఆ అలిగిన టీచర్ ను సముదాయించే తీరు అందరినీ ఆకట్టుకుంది. నిజంగా అల్లరి చేయను అంటూ ఆ విద్యార్థి ముద్దుముద్దుగా పదేపదే చెప్పడంతో ఆ టీచర్ సంతోషిస్తుంది. అయితే ముద్దుపెట్టుకోమని అడగడంతో ఆ టీచర్ రెండు చెంపలపై ఆ చిన్నోడు ముద్దు పెడుతాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆదరిస్తుండడంతో ఈ క్లిప్పింగ్ ను ఇప్పటికే 4 లక్షల మంది చూశారు. 18వేల మంది లైక్ చేశారు. వీడియో ఎంతో ముద్దుగా ఉంది.
మా పాఠశాల రోజుల్లో ఇలాంటి టీచర్లు ఎందుకు లేరు అంటూ ఆ అందమైన టీచర్ ను చూసి కుల్లుకుంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.