Begin typing your search above and press return to search.
దుమారం: కరోనా వేళ చైనాలో ముద్దుల పోటీ
By: Tupaki Desk | 21 April 2020 6:30 PM GMTప్రపంచానికి కరోనా వైరస్ అంటించి ఇప్పుడు వివిధ దేశాల్లో అందరి ప్రాణాలు పోతుంటే చలికాగుతున్న చైనాకు ఇంకా బుద్ది రావడం లేదని అర్థమవుతోంది. అన్ని దేశాల్లో కరోనాతో లక్షల ప్రాణాలు పోతుంటే ఆ వైరస్ కు కారణమైన చైనీయులు మాత్రం కరోనా మరింత వ్యాపించేలా ముద్దుల పోటీలు నిర్వహించడం దుమారం రేపుతోంది.
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ చైనాలోని ఒక ఫ్యాక్టరీలో ముద్దుల పోటీ పెట్డంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కరోనా టైంలో భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘిస్తూ సుజౌ నగరంలోని యుయా ఫర్నిచర్ ఫ్యాక్టరీలో ముద్దుల పోటీని నిర్వహించారు.
పది జంటలు ముద్దల పోటీలో పాల్గొన్నారు. ముద్దు పెట్టుకునే ముందు ఫేస్ మాస్క్ లు తొలగించి ఇన్ ఫెక్షన్ తీవ్రత తగ్గించడానికి జంటల మధ్య ఫ్లెక్సీ గ్లాస్ ను ఉంచారు ఫ్యాక్టరీ నిర్వాహకులు. లాక్ డౌన్ ఎత్తివేయడంతో ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడానికే ఈ పోటీని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
ఈ ముద్దల పోటీల ఫొటోలు - వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి చర్యను నెటిజన్లు తప్పుపడుతున్నారు. మళ్లీ కరోనా వ్యాపించచేస్తారా అంటూ మండిపడుతున్నారు.