Begin typing your search above and press return to search.
సంక్రాంతి వేళ..ఈ కొత్త బిజినెస్ ముచ్చట తెలుసా?
By: Tupaki Desk | 14 Jan 2018 6:13 AM GMTఆలోచించే బుర్ర ఉంటే ఐడియాలకు కొదవ ఉండదు. ప్రతిదాన్లోనూ బిజినెస్ చూసేటోడు కొత్త కొత్త బిజినెస్ లు స్టార్ట్ చేస్తుంటాడు. అలాంటి బిజినెస్ ముచ్చటే ఇది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో సంక్రాంతి వేళ కొత్త బిజినెస్‌కు తెర తీస్తుంటారు.
సంక్రాంతి పండగ అనగానే ముగ్గులు.. పిండివంటలు.. సినిమాలతో పాటు పతంగులు కూడా. ఈ పతంగుల విషయంలో సరికొత్త రీతిలో బిజినెస్ ను అహ్మదాబాద్ లో నిర్వహిస్తుంటారు. కాంక్రీట్ జంగిల్ గా నగరాలు మారిపోతున్న వేళ.. గాలి పటాలు ఎగురవేయటానికి అవకాశం లేని పరిస్థితి. దీన్నో అవకాశంగా తీసుకొని.. తమ ఇంటి పైన మిద్దెల్ని తాత్కాలికంగా అద్దెకు ఇచ్చే వైనం అహ్మదాబాద్ లో మాత్రమే కనిపిస్తుంది.
విశాలమైన పైకప్పులు ఉండే వారు.. పతంగుల్ని ఎగురవేసుకోవటానికి వీలుగా కొందరికి తమ ఖాళీ మిద్దెల్ని అద్దెకు ఇస్తుంటారు. రోజు చొప్పున ఈ అద్దె ఉంటుంది. ఇంతకీ అద్దె ఎంత ఉంటుందో తెలుసా? రోజుకు రూ.12 వేల నుంచి రూ.155వేల వరకు. గాలిపటాలు ఎగురవేసేందుకు వీలుగా తమ మిద్దెల మీద అవకాశం కల్పించటంతో పాటు.. కుర్చీలు ఏర్పాటు చేస్తారు. బాత్రూం సౌకర్యాన్నికల్పిస్తారు. సంక్రాంతి వేళ భారీగా పతంగుల బిజినెస్ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. సుమారు రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్యన జరుగుతుందట.
ఇక మిద్దెలు అద్దెకు కావాల్సిన వారు తమకు సంబంధించిన వివరాల్ని ఇవ్వటంతో పాటు.. తెలిసిన వారి రిఫరెన్స్ తప్పనిసరి అని చెబుతున్నారు. ఈ తరహా ఐడియా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ అమలు చేసినోళ్లు లేరు. చూడండి.. ఇదేదో వర్క్ వుట్ అయ్యేలా కనిపించట్లేదు?