Begin typing your search above and press return to search.
కేన్ మామ లేకుండానే కివీస్ భారత టి20లు
By: Tupaki Desk | 16 Nov 2021 1:30 PM GMTకూల్.. క్లాసీ.. కేన్ విలియమ్సన్ లేకుండానే న్యూజిలాండ్ జట్టు భారత్ తో టీ20 సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోనున్న అతడు.. రెండు టెస్టుల సిరీస్ కు సిద్ధం కానున్నాడు. దీంతో కివీస్ జట్టుకు టి20ల్లో టిమ్ సౌథీ సారథ్యం వహిస్తాడు. కాగా, ఆదివారం ఆస్ట్ట్రేలియాతో టి20 ఫైనల్లో తలపడిన న్యూజిలాండ్.. ఆ వెంటనే భారత్ కు పయనమైంది. బుధవారం రాజస్థాన్ లోని జైపూర్ లో జరుగనున్న తొలి టి20లో భారత్ ను ఎదుర్కోనుంది. ఇక విలియమ్సన్ ఈ నెల 25 నుంచి జరిగే టెస్టు సిరీస్ కు అందుబాటులోకి వస్తాడు.
పని భారం తగ్గించుకునేందుకు..
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ బ్యాట్స్ మన్ నలుగురు. వీరిలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా),జో రూట్ (ఇంగ్లాండ్), విలియమ్సన్. అయితే వీరందరిలో విలియమ్సన్ ప్రత్యేకత వేరు. టెస్టు, వన్డే, టి20 ఇలా మూడు ఫార్మాట్లలోనూ ఆడుతూ జట్టుకు సారథ్యం వహిస్తున్నది ఇతడొక్కడే. కోహ్లి ఇటీవలే టి20 సారథ్యాన్ని వదులుకున్న సంగతి తెలిసిందే. ఇక రూట్ ఇంగ్లండ్ టి20 సారథి అయినా.. టి20 జట్టులో చోటే లేదు. బాల్ ట్యాంపరింగ్ తో బాగా దెబ్బతిన స్మిత్ కు దేంట్లోనూ కెప్టెన్సీ లేదు. టెస్టులు, వన్డేల్లో ఢోకా లేకున్నా.. టి20ల్లో అతడి స్థానం ప్రశ్నార్థంకమైంది ఇప్పుడు. దీన్నిబట్టి ఆటగాడిగా.. కెప్టెన్ గా విలియమ్సన్ ఎంతటి భారం మోస్తున్నాడో అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలోనే భారత్ తో టి20 సిరీస్ కు అతడికి విశ్రాంతినిచ్చారు.
ఆటలోనూ మాటలోనూ..
టెక్నికల్ గా ఎంత గొప్ప ఆటగాడో.. దూకుడులోనూ అంతే నిష్ణాతుడని అనేక సార్లు నిరూపించాడు. కళాత్మక విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలంటే విలియమ్సన్ బ్యాటింగ్ చూడాల్సిందే. ఫీల్డర్ల మధ్య నుంచి బంతులను బౌండరీకి తరలించాలన్నా.. మిచెల్ స్టార్క్ వంటి క్లిష్టమైన బౌలర్ కూ చుక్కలు చూపాలన్నా అది కేన్ కే సాధ్యం. మూడు రోజుల క్రితం జరిగిన టి20 ప్రపంచ కప్ ఫైనల్లో స్టార్క్ బౌలింగ్ లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ తో విలియమ్సన్ చెలరేగిన తీరు అద్భుతం. ఆ ఓవర్ తోనే వాస్తవానికి న్యూజిలాండ్ మ్యాచ్ లో మంచి స్కోరు చేసే స్థాయికి చేరింది. బ్యాటింగ్ లో ఎంత ప్రతిభావంతుడో..
ప్రవర్తనలోనూ అంతే ఉన్నతుడు. 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిన సందర్భంలో కానీ.. ఇటీవలి టి20 ప్రపంచ కప్ లో పరాజయం పాలైన సందర్భంలో కానీ విలియమ్సన్ హుందా ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపించలేదు. అందుకే దేశాలకతీతంగా అతడికి అభిమానులు ఉన్నారు. రెండేళ్ల క్రితం శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు విలియమ్సన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు భారీగా అభిమానులు ఎగబడ్డారు. ఇక కొన్నేళ్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తూ మన హైదరాబాదీలకు చాలా దగ్గరయ్యాడు విలియమ్సన్. అందుకే విలియమ్సన్ ను మన తెలుగువారు కేన్ మామ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.